ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ఇక ప్రపంచాన్ని మొత్తం కూర్చున్న చోటు నుంచి చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ఎందుకంటే ప్రపంచ నలమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఎన్నో రకాల వీడియోలు వెలుగులోకి వస్తాయి. కొన్ని వీడియోలు నవ్విస్తే ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.


 మరి కొన్ని వీడియోలు మాత్రం ఏకంగా వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు అడవుల్లో ఉండే ఎన్నో క్రూర మృగాలు సాదు జంతువులను వేటాడటం కు సంబంధించిన వీడియోలు చూశాం. అయితే ఇక ఎన్నో గద్దలు డేగలు రాబందులు లాంటివి ఇక చిన్న చిన్న జంతువులను సైతం రెప్ప పాటు కాలంలో వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. కానీ ఏకంగా డేగలు మనుషులను వేటాడటం గురించి ఎప్పుడైనా విన్నారా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా ఒక రాకాసి డేగ 8 ఏళ్ల బాలికను వేటాడాలని ప్రయత్నించింది.



 కొండ ప్రాంతంలో కొన్ని కుటుంబాలు సరదాగా గడపడానికి వచ్చాయ్. ఈ సమయంలో 8 ఏళ్ల బాలిక ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే ఏకంగా గాల్లో విహరిస్తున్న ఒక రాకాసిడేగా ఆ బాలికను చూసింది. దీంతో ఆ బాలికను వేటాడాలని అనుకుంది. వెంటనే భూమి మీదకు దూసుకు వచ్చి ఆ బాలిక పైన దాడి చేసింది. కానీ అంతలోనే పక్కన ఉన్న వాళ్ళు అప్రమత్తం కావడంతో ఇక పరుగులు పెట్టి ఆ డేగ భారి నుంచి బాలికను విడిపించారు. అప్పటికే ఆ బాలికకు గాయాలు అయ్యాయి. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఏకంగా డేగ ఎనిమిదేళ్ల బాలికను వేటాలని ప్రయత్నించిన తీరు చూసి ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: