గద్దలు, డేగలు, రాబందులు వేటాడే విధానం ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిలోమీటర్ల ఎత్తులో గాల్లో నుంచే ఏకంగా భూమ్మీద ఉండే చిన్న చిన్న జీవులను సైతం టార్గెట్ చేసి ఇక సెకండ్ల వ్యవధిలో వేటను కొనసాగిస్తూ ఉంటాయి. ఇక భారీ ఆకారంలో ఉండే డేగలు అయితే ఏకంగా పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి తరహా వీడియోలు చాలానే వెలుగులోకి వస్తున్నాయ్ .


 అయితే ఇలా డేగలు గద్దలు రాబందులు వేటాడే విధానం చూసి ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక డేగ ఏకంగా నక్కను వేటాడిన ఒక వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా అయితే నక్క ఇతర జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఇక అడవుల్లో ఉండే ప్రమాదకరమైన జీవులలో నక్క కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన నక్కని అలవోకగా వేటాడి కాళ్లతో పట్టుకొని గాల్లోకి ఎగిరింది డేగ.


 ఆకాశంలో విహరిస్తున్న డేగా కొండ అంచున నిలబడి ఉన్న నక్కను చూసింది. ఆ నక్కను చూడగానే ఆ డేగకు కడుపు నింపుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఇంకేముంది ఆ నక్కను టార్గెట్ చేసి రెప్పపాటు కాలంలో దానిపై దాడి చేసింది. చూస్తూ చూస్తుండగానే తన పదునైన కాళ్లతో నక్కను పొడిచి పొడిచి చంపేసింది. ఇక కొండ అంచున పడిపోయి ఉన్న నక్కపై కూర్చున్న డేగ కాసేపు అటు ఇటు చూసి ఏకంగా చనిపోయిన నక్కను దూరంగా తీసుకువెళ్లాలి అనుకుంది. దీంతో ఇక దాని మృతదేహంతో సహా గాలిలోకి లేస్తుంది. అంతా బరువు ఉన్న నక్కను కూడా గోర్లతో ఎంతో గట్టిగా పట్టుకుని అవలీలగా డేగ మోసుకు వెళ్లడం చూసి నెటిజన్స్  అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: