ఇటీవల కాలంలో యువకులకే గుండె పోట్లు వస్తున్నాయి దీనివల్ల వారు అక్కడ కుప్ప కూలిపోయి మరణిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం, జామనగర్ జిల్లాలో ఇలాంటి మరొక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి కిషన్ మంగళవారం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. క్షణాల్లోనే అతని ఊపిరి పోయింది. ఈ సంఘటన జిమ్‌లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ షాకింగ్ వీడియో చూసి చాలామంది భయపడుతున్నారు. ఈ వీడియోను చూసేందుకు https://x.com/nirbhaybnews/status/1826225391788503513?t=ilmMS9lEPHgqOofBEWLjCg&s=19 లింక్ పై క్లిక్ చేయవచ్చు.

కిషన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినా, వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించారు. కిషన్ తండ్రి హెమంత్ జామనగర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థ అయిన వెస్ట్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (PGVCL)లో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో యువత హఠాత్తుగా కుప్పకూలి మరణించే సంఘటనలు పెరుగుతున్నాయి. అలాంటి చాలా కేసుల్లో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై నగరంలోని నుంగంబక్కం ప్రాంతంలోని ఒక పబ్‌లో శనివారం రాత్రి 22 ఏళ్ల మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థి కుప్పకూలి మరణించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, మృతుడిని మొహమ్మద్ సుహైల్‌గా గుర్తించారు. అతను రామపురం లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడని పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల ప్రకారం, సుహైల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాత్రి 9 గంటలకు పబ్‌కు వచ్చాడు. వారు రాత్రి అంతా పబ్‌లో డాన్స్ చేసి, సరదాగా గడిపారు. సుహైల్ స్నేహితులతో కలిసి ఆహారం తింటూ మాట్లాడుతున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా చెమట పట్టింది. అనారోగ్యం అని అతను స్నేహితులకు చెప్పాడు. కొద్ది క్షణాల తర్వాత అతను నేలపై కుప్పకూలాడు. అతని స్నేహితులు, పబ్ సిబ్బంది అతన్ని వెంటనే ప్రభుత్వ కిల్పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (KMCH) కు తరలించారు. అక్కడ అతన్ని చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటన గురించి తెయనంపేట్ పోలీసులకు తెలియజేయడంతో, వారు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు.

అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసి, వివరణాత్మక విచారణ ప్రారంభించారు. సుహైల్‌కు గుండెపోటు వచ్చి ఉండవచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే, అతని తల్లిదండ్రులు పోలీసులకు అలాంటి ఆరోగ్య సమస్యలు తెలియదని తెలియజేశారు. అతను పబ్‌లో మద్యం తాగలేదని అతని స్నేహితులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: