సాధారణంగా సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కలకంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సొంతిల్లు కట్టుకునే సమయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక మంచి ఇంజనీర్ ను పిలిపించుకొని ఒక్క అడుగు స్థలం కూడా వృధా కాకుండా ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అభిరుచులకు తగ్గట్లుగా ఇల్లు ఉంటే అంతకంటే ఇంకేం కావాలని ఆశపడుతూ ఉంటారు.



 అయితే ఇప్పుడు వరకు ఎంతోమంది ఇల్లు విశాలంగా ఉండేందుకు దాదాపు 200 అడుగులు లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ స్థలంలోనే ఒక పెద్ద ఇల్లును కట్టుకోవడం  చాలాసార్లు చూశాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇల్లు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు. సాధారణంగా ఒక మనిషికి రెండు అడుగుల స్థలం మాత్రమే ఉంటే ఏం చేస్తారు.. రెండు అడుగుల స్థలంతో ఏం చేయగలం అని సైలెంట్ గానే ఉండిపోతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం రెండు అడుగుల స్థలంలోనే ఒక పెద్ద ఇల్లు కట్టి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు. సాధారణంగా అంతస్తులలో ఇల్లు కట్టాలంటే ఎంత తక్కువలో తక్కువ అయినా 20 నుంచి 25 గజాల స్థలం అవసరం అవుతుంది.



 కానీ ఇక్కడ ఒక ఇంజనీర్ మాత్రం ఏకంగా రెండు అడుగుల స్థలంలోనే పెద్ద ఇల్లు కట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే.. అక్కడ కట్టిన ఇల్లు కేవలం ఒకటిన్నర నుంచి 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. కానీ అది 50 అడుగుల ఎత్తు ఉంది. ఎంత సన్నటి ఇల్లు ఎలా కట్టాడు. పై అంతస్తులకు ఎలా ప్రజలు వెళ్తారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలోనే దానికి సమాధానం దొరికింది. ఇల్లు మొదలవుతున్న చోటు చాలా సన్నగా ఉన్న.. ముందుకు వెళ్లే కొద్దీ అది వెడల్పుగా మారింది. ఇంటి ముందు భాగంలో ఉన్న షెటర్ తెరిచి ఉండడం వల్ల అక్కడ ఉన్న దుకాణం కనిపిస్తుంది. అయితే అది చూస్తే ఇల్లు లోపల ఎంత వెడల్పుగా ఉందో అర్థమవుతుంది. కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఇల్లు ఎంత సన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: