పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవడం ఖాయం. కానీ ఎలా చనిపోతాం అనేది ఎవరూ చెప్పలేరు. కొందరు జబ్బులతో చనిపోతారు. మరికొందరు భయంకరమైన ప్రమాదాల్లో మృత్యువాత పడతారు. కొందరు మాత్రం చావు అంచుల వరకు వెళ్లి మృత్యువు నుంచి బయటపడతారు. అసాధ్యమైన పరిస్థితుల్లో బతికి బయటపడ్డారంటే అది దేవుడి దయే అని చాలామంది అంటారు. అలాంటి ఒక సంఘటన రీసెంట్ గా చోటుచేసుకుంది. ఒక రోడ్డు ప్రమాదంలో పిల్లోడు సురక్షితంగా బయటపడ్డాడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
ఈ వీడియోలో, కొంతసేపు రోడ్డుపై వాహనాలు సాఫీగా వెళ్తుండగా, ఒక బైక్ వేగంగా వచ్చి ముందు ఉన్న స్కూటీని కొట్టింది. ఆ బైక్‌పై దంపతులు తమ కుమారుడిని ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చోబెట్టి వెళ్తున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగాక భార్య తన భార్యతో సేమ్ బైక్ పైన నుంచి రోడ్డు మీద కింద పడ్డారు. కానీ పిల్లవాడు దానిమీద ఉన్నాడు. బండి కింద పడలేదు. పిల్లవాడితో కలిసి బైక్ వేగంగా అలానే ముందుకు తీసుకెళ్లింది. అక్కడ రోడ్డుపై వేరే వాహనాలు సాధారణ వేగంతోనే వెళ్తున్నాయి. ఆ చిన్నారి మాత్రం తన సీటులోనే కూర్చుని ఎందుకు జంపు చేయకుండా ఉన్నాడు.
ఆ బైక్ ఎవరూ నడపకుండానే, ఆ చిన్నారి అందులో కూర్చుని దాదాపు అర కిలోమీటర్ దూరం వెళ్ళాడు. రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును ఢీకొన్న తర్వాత ఆ బైక్ గడ్డి మీద పడిపోయింది. ఆ చిన్నారి కూడా పొదలలో పడ్డాడు. అందువల్ల ఈ బాలుడికి పెద్దగా గాయాలు అవ్వలేదు. ఈ వీడియోను మరొక కారులో ఉన్న కెమెరా రికార్డ్ చేసింది. అక్కడకు వచ్చిన కొంతమంది ఆ చిన్నారిని ఎత్తుకొని వెళ్లారు. ఆ బైక్ మరొక వాహనాన్ని ఢీకొంటే ఆ చిన్నారి ప్రాణం ఎంతో ప్రమాదంలో పడి ఉండేది. ఈ వీడియోను X లో పోస్ట్ చేయగా, దాన్ని నాలుగు లక్షల మందికి పైగా చూశారు. కామెంట్స్ లో ఒకరు, 'ఇది దాదాపు ఒక అద్భుతం. ఆ చిన్నారి సురక్షితంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది' అని రాశారు. "ఇది నిజంగా ఒక అద్భుతం" అని మరొకరు అన్నారు.
"ఈ ప్రమాదానికి కారణం: బైక్ వేగంగా ముందు వాహనానికి ఎలాంటి సేఫ్టీ స్టంట్ పాటించకుండా వెళ్ళడమే" అని నెటిజన్లు అన్నారు. ఈ వీడియోను https://x.com/HasnaZaruriHai/status/1825934254662176830?t=8pEWBLz7fNNWomvk_HDTpQ&s=19 లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చు.