సింహాన్ని ఊరికే అడవికి రాజు అని అనలేదు. అవి చాలా ధైర్యవంతమైనవి. ఏనుగులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, కొండచిలువలు, అనకొండలు ఇలా వేటితోనైనా అవి పోరాడడానికి నిత్యం సై ఉంటాయి. అందుకే అడవిలో పూర్తి ఆధిపత్యాన్ని ఇవే ప్రదర్శిస్తుంటాయి. వేటాటడం మొదలెడితే తగ్గే ప్రసక్తే లేదు అని ఇది చెప్పకనే చెబుతుంటాయి. అయితే వేటాడే క్రమంలో లేదంటే కారణాలవల్ల సింహాలు అనారోగ్యం బారిన పడుతుంటాయి కొన్నిసార్లు వాటి కాళ్లు విరగడం తీవ్రమైన గాయాలు కూడా అవుతుంటాయి.
బలహీనంగా ఉన్నా సరే వాటిలో ధైర్యం ఏ మాత్రం తగ్గదు. అత్యంత ఆరోగ్యకరమైన, యువ సింహాల వలె చివరి వరకు అవి అదే పౌరుషం స్థాయి మిగతా జంతువులకు వణుకు పుట్టిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ మాటలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వీడియోలో కుంటి సింహం ఒకటి పెద్ద రాబందులు, పదుల సంఖ్యలో హైనాలను హడలెత్తించింది. సింగిల్ గా వచ్చినా అంత పెద్ద గుంపును ఒకేసారి అది పరిగెత్తించింది. దాని ధైర్యానికి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ముందుగా అడవిలో ఓ ఏనుగు చనిపోయి ఉండటం, దాని కళేబరాన్ని రాబందులు, హైనాలు గుంపులుగా చేరి పీక్కుతినడం కనిపిస్తుంది. అవి అలా మాంసాన్ని తింటూ ఉండగా సడన్ గా ఓ సింహం కళేబరం దగ్గరికి జంపు చేస్తుంది. వేరే వైపు నుంచి ఒక బాణం లాగా దూసుకు వచ్చింది. దాంతో ఒకేసారి రాబందులతో పాటు హైనాలు ఇంటికి కనిపించకుండా అక్కడినుంచి పరారయ్యాయి. వీడియో చివరిలో ఈ సింహం సరిగ్గా నాలుగు కాళ్ల మీద నిలబడలేకపోతుందని తెలుస్తుంది. అది వెనక కాళ్లతో కుంటుతూ ఉంటుంది. వేటాడే ఓపిక లేక సులభంగా దొరికే మాసం కోసం ఇది ప్రయత్నిస్తున్నట్టుంది. ఆ మాంసాన్ని దక్కించుకోవడంలో సక్సెస్ సాధించింది.
ఇది కుంటిదైనా సరే, వేటాడే/ఇతర జీవులను చంపే ఓపిక లేదని తెలిసినా సరే వాటిని భయపెట్టింది. ఇది ధైర్యానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. వీడియో చూసిన నెటిజన్లు "అందుకే సింహాలను అడవికి రాజు అంటారు" అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ప్రస్తుతం రెండు కోట్ల 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీన్ని ఈ https://x.com/AMAZlNGNATURE/status/1824280140383150380?t=wiNLKdHuV6-ChKPK1ppIqQ&s=19 లింకుపై క్లిక్ చేసి వీక్షించవచ్చు.