సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని మంచి కారణాల వల్ల వైరలైతే, కొన్ని మాత్రం చెడు కారణాల వల్ల వైరల్ గా మారుతుంటాయి. ఉదాహరణకి వధువు మంచిగా డాన్స్ చేస్తే అది స్పెషల్ మీడియాను ఊపేస్తుంది. వధూవరుల మధ్య ఏదైనా మంచి రొమాంటిక్ మూమెంట్ ఉన్నా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. మిగతా సమయాల్లో విచిత్రమైన కారణాలవల్ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆ వీడియో చూశాక ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అంత విచిత్రమైన సంఘటన ఈ వీడియోలో కనిపించింది. వీడియోలో పెళ్లి మండపంలో వధూవరులు కూర్చుని కనిపిస్తారు. కొన్ని సెకన్ల తర్వాత ఓ యువతి మండపం పైకి డ్యాన్స్ చేస్తూ వస్తుంది. ఆపై వరుడు పక్కన తాపిగా కూర్చుంటుంది. అప్పటిదాకా బాగానే ఉంటుంది అప్పుడే ఒక షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది అదేంటంటే వరుడు ఆ యువతికి లిప్ కిస్ ఇస్తాడు. దానికి అప్పుడే పెళ్లయింది పక్కనే తన భార్య కూడా ఉంది అతిథులు అందరూ వీళ్ళకెళ్ళే చూస్తున్నారు.
సరిగ్గా ఆ సమయంలో ఆ వరుడు ఒక పాడు, పని ఒక పిచ్చి పని చేసి అతిధులందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. వధువు మాత్రం అక్కడ ఏం జరగలేదన్నట్టుగా అమాయకంగా కూర్చొని ఉండటం చూసి అతిధులకి మరింత మతి పోయింది. ఈ వీడియోను https://www.instagram.com/reel/C9xaPJmyFQf/?utm_source=ig_web_copy_link లింకు పైకి క్లిక్ చేసి చూడవచ్చు. ఈ షాకింగ్ వీడియోను 'memesmasala_mix' అనే ఇన్‌స్టా అకౌంటు రీసెంట్ గానే షేర్ చేసింది. అప్పుడే దీనికి 20 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. చాలామంది ఈ జంట కలిసి ఉంటారా లేదంటే త్వరలోనే విడిపోతారా అని సందేహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి పనిచేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. దీనికి ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మరి లేట్ ఎందుకు ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.