ఈ మధ్యకాలంలో చాలామంది ఎవరు ఎటు పోతే మాకేంటి అనే ధోరణిలోని జీవిస్తున్నారు. అయితే మరికొంతమంది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ మాత్రం ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది కానీ జీవితాలను మార్చే పని చేస్తే సంతృప్తి కలుగుతుంది అని గ్రహించిందేమో.. అందుకే సివిల్స్ సాధించి ఇష్టంగా సమాజాన్ని తీర్చిదిద్దుతోంది ఐఏఎస్ ధాత్రి రెడ్డి. ఐఏఎస్ గా చలామణి అవుతున్న ధాత్రి తాజాగా సమాజసేవపై స్పందించారు.

యాదాద్రి జిల్లా గుండ్ల బావికి చెందిన ఈమె.. చిన్న వయసులోనే పేదరిక నిర్మూలన , ప్రజా చైతన్య వంటి అంశాల గురించి ఆలోచించేదట. ఐఐటి ...ఖరగ్పూర్ లో పూర్తి చేసిన తర్వాత ఆ సమయంలోనే ఒకవైపు ఆహారం వృధా అవుతుంటే మరొకవైపు ఆకలితో అలమటిస్తున్న పేదలను చూసి ఎంతో బాధపడిందట.ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చింది సమాజసేవ. 2016లో స్నేహితులతో కలిసి ఫీడ్ ఇండియా అనే ఒక ఎన్జీవోని ప్రారంభించి హోటల్లు , మెస్ లలో వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి ఫుట్ పాత్ ఇతర ప్రదేశాలలో ఉండే పేదలకు అందించేవారట. మిగిలిన ఆహార వివరాలు తెలుసుకోవడానికి వీలుగా ఒక యాప్ ని కూడా రూపొందించారట. అలా వేలాది మంది ఆకలి తీర్చగలిగామని చెబుతోంది ధాత్రి.

సహ ఉద్యోగి అయిన ప్రతాప్ శివ కిషోర్ ని వివాహం చేసుకున్న తర్వాత తాను సివిల్స్ రాయడంలో తన భర్త ఎంతగానో ప్రోత్సహించాడట. 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యాను అని తెలిపింది ధాత్రి. ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని పాడేరు సబ్ కలెక్టర్ గా నేను , చింతపల్లి ఏఎస్పీగా మా ఆయన బాధ్యతలు చేపట్టాము. భార్య భర్తలు అంటే కష్టసుఖాల్లో కలిసి అడుగు వేయడమే కదా మాకు ఉద్యోగ బాధ్యతలలోనూ కలిసి పనిచేసే అవకాశం లభించింది దానిని సద్వినియోగం చేసుకుంటున్నాము. ఇక ఏజెన్సీలో బాల్యవివాహాలు ఎక్కువ కాబట్టి దానిని మేము నిర్మూలించాము . అంతే కాదు బాల్య వివాహాల సమాచారం ఇచ్చిన వారికి డబ్బులు బహుమతిగా కూడా అందించాము. మా సంపాదనలోనే ఆ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తున్నాము అంటూ తెలిపింది.

పిల్లల కోసం క్రీడా మైదానాలు ,ఆట వస్తువులు కూడా అందించాము. పిల్లలు ఆడుకునేలా అన్ని సిద్ధం చేశాము అంతేకాదు 58 క్రీడా మైదానాలను అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేశాము. ది బెటర్ ఇండియా సంస్థ నుంచి ఉత్తమ ఐఏఎస్ గా గుర్తింపు వచ్చిన తర్వాత ఏలూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా నేను , మావారు ఎస్పీగా పనిచేసే అవకాశం లభించింది.  ఇప్పుడు ఇద్దరం కూడా జిల్లా ప్రగతికి కృషి చేస్తున్నాము అంటూ తెలిపారు ధాత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: