హిందువులు సైతం ఎక్కువగా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈరోజు జన్మించిన రోజుగా అందరూ చాలా గ్రాండ్గా ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణాష్టమి రోజున శుభ సమయం కృష్ణుడిని పూజించడానికి ఏది సరైన సమయం అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


అయితే పంచాంగం ప్రకారం భద్ర పద మాసంలో కృష్ణపక్ష అష్టమి తిధి రోజున కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉంటారట. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26 వ తేదీన ఇది వస్తుందట. అయితే ఈ తేదీన ఈరోజు మధ్యాహ్నం 3:39 నిమిషాలకు ప్రారంభమై ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 27 వ తేదీన తెల్లవారుజామున 2:19 నిమిషాలకు ముగుస్తుందట. శ్రీకృష్ణుడు రాత్రి సమయంలోనే జన్మించారు కాబట్టి ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటారు. అందుకే రాత్రిపూట చాలా మంది పూజలు కూడా చేస్తూ ఉంటారు.


ఈ రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమై 12:44 వరకు కొనసాగుతూ ఉంటాయి. పూజకు కేవలం ఈ 44 నిమిషాలు మంచి వంతు పండితులు సైతం తెలియజేస్తున్నారు. ఈ కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే కృష్ణుడిని సైతం ప్రసన్నం చేసుకొని అవకాశం ఉంటుందట. అయితే కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజించాలి అనుకునేవారు ఉదయం లేవగానే స్నానం చేసి ఉపవాసం ఉంటామని కృష్ణుడు ముందర ప్రతిజ్ఞ చేసుకొని.. అలాగే ఇంట్లో కాని ఆలయంలో కానీ శ్రీకృష్ణుని బాలరూపాన్ని ప్రతిష్టించి ఆ కృష్ణుని ముందు దీపం వెలిగించి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. శ్రీకృష్ణుడిని కి ఈరోజు చాలా ప్రత్యేకమైన దినము కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి సంతానం లేని వారు కోరుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని పలువురు విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. చాలా ప్రాంతాలలో ఈ రోజున కృష్ణాష్టమి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: