ఇండియాలో ఉన్న చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనుకుంటారు. కానీ భారత దేశంలో చదువుకోడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే వారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, వారు ఏ కోర్సు చదివినా, విదేశాలలో చదువుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయులకు ఒకప్పుడు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు ఫస్ట్ ఆప్షన్స్ అయ్యేవి.

ఇండియాలో కంటే విదేశాల్లో జీవన నాణ్యత బాగుంటుంది, చదువు కూడా హై క్వాలిటీలో లభిస్తుంది., ఉద్యోగాలు కూడా బాగా లభిస్తాయి. పూర్వం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకే ఎక్కువ మంది వెళ్లేవారు. కానీ ఇప్పుడు జర్మనీ, కిర్గిజ్‌స్తాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజీలాండ్ వంటి దేశాలకు కూడా చాలామంది వెళ్తున్నారు.

ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, 2019లో దాదాపు 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలలో చదువుకుంటున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య 11.80 లక్షలకు చేరింది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. అంటే, ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇండియా నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు 2019లో దాదాపు 8.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2022 నాటికి 8% పెరిగి 8.98 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అయితే, 2025 నాటికి ఈ ఖర్చు 5.86 లక్షల కోట్ల రూపాయలకు తగ్గుతుందని అంచనా. విదేశాలకు చదువుకోవడానికి ఎక్కువగా మహారాష్ట్ర, పంజాబ్, తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. మొత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో 37% మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. అంటే, ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 12.5% మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. లేకున్న తర్వాత విదేశాల్లోనే సెటిల్ కావడానికి విద్యార్థులు ముగ్గు చూపుతున్నారు ఇండియాకి మాత్రం తిరిగి రావడం లేదు అనేది చాలామంది చెబుతున్న మాట. దానికి లెస్ ట్రాఫిక్, లైఫ్ క్వాలిటీ వంటివి ఎన్నో కారణం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: