ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ బిజినెస్‌మ్యాన్ లల్లో ఒకరైన ఆనంద్ మహీంద్ర గురించి అందరికీ తెలుసు. మహీంద్ర గ్రూప్ ఛైర్మన్‌గా ఉంటూ ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. కొత్త కొత్త వీడియోలను, విషయాలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిచే మహీంద్ర తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహీంద్ర పోస్ట్ చేసిన కొత్త వీడియో చూస్తే అందరికీ చిన్నతనం గుర్తుకురాక తప్పదు. చిన్నప్పుడు అందరూ పేపర్లలో గాలిపటాలు, పేపర్ ప్లేన్, ఇంకా ఎన్నో వస్తువులు తయారు చేసి ఆడుకుని ఉంటారు. ఇప్పుడైతే ఆన్‌లైన్ గేమ్స్ వచ్చేశాయి కాబట్టి పిల్లలందరూ ఆ ఆటలు ఆడుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం ఈ మొబైల్స్ లేకపోవడం వల్ల అందరూ ఆటలే ఆడుకుంటూ ఆనందంగా ఉండేవారు.

తాజాగా మహీంద్ర షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. గాల్లో వేగంగా దూసుకుపోయే పేపర్ ప్లేన్‌ను అతి సులభంగా తయారు చేసుకునే విధానాన్ని వీడియోలో చూడొచ్చు. ఈనాటి పిల్లలకు ఈ వీడియో చాలా అవసరం అని చెప్పాలి. వీడియోను షేర్ చేస్తూ మహీంద్ర ఓ ట్వీట్ చేశారు. పిల్లలకు ఇప్పుడు ఈ పేపర్ ప్లేన్‌లపై ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియడం లేదని, అయితే తన స్కూల్ డేస్‌లో మాత్రం చాలా దూరం వేగంగా వెళ్లేలా పేపర్ ప్లేన్‌ని డిజైన్ చేసేవాడినని మహీంద్ర తెలిపారు. ఒకవేళ పోటీలు పెడితే తన పేపర్ ప్లేన్ గెలిచేలా చూసేవాడినని తన చిన్ననాటి విషయాలను మహీంద్ర గుర్తు చేసుకున్నారు.

ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమ చిన్నతనంలో పేపర్ ప్లేన్స్ తయారు చేయడం, వాటిని ఎగురవేసి ఆనందించడాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు కామెంట్స్‌లో తెలుపుతున్నారు. ఈరోజుల్లో చిన్నారులకు ఇలాంటివి కచ్చితంగా నేర్పించాలని, వీటి ద్వారా పొందే ఆనందం అంతా ఇంతా కాదని మరికొందరు చెబుతుంటే ఇప్పటి పిల్లలకు ఇవి చాలా అవసరం అంటూ సలహా ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: