తరచూ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సంఘటనలను చూసి అందరూ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తూ ఉన్నాయి. సమాజాన్ని రక్షిస్తున్న పోలీసుల పైన కూడా చాలామంది ఈ మధ్యకాలంలో తిరగబడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇలాంటి సంఘటన లక్నోలో కనిపిస్తోంది.ముఖ్యంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణను నివారించేందుకు సైతం కానిస్టేబుల్ రావడంతో కొంతమంది కానిస్టేబుల్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతున్నది వీరికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని ఖుషి నగర్ లో జరిగిన ఒక సంఘటనట. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా సిద్దువ ఆలయాన్ని సైతం సందర్శించేందుకు అక్కడికి భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలివచ్చారట. అక్కడ జాతరను సైతం చూసేందుకు వెళుతున్న రెండు గ్రూపుల మధ్య ఒక వాగ్వాదం జరిగిందట. అయితే ఇది నెమ్మదిగా పెద్ద గొడవగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతాయని అక్కడే ఉన్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు.


అయితే ఇరువు వర్గాల మధ్య ఘర్షణను సైతం  ఆపివేసేందుకు ప్రయత్నించగా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ పోలీస్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక యువతి అయితే ఏకంగా కర్రతో కానిస్టేబుల్ ని కొట్టినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. మరొక వ్యక్తి ఆ పోలీస్  నెట్టడంతో చొక్కా పట్టుకొని చించేశారు అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ అక్కడున్న వారు ఎవరు కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్ ని సైతం కాపాడేందుకు ముందుకు రావడం లేదు.. మరొకవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం పైన పోలీస్ అధికారులు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పైన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లుగా పోలీసు అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: