పాములు చాలా సైలెంట్‌గా ఇళ్లలోకి చొరబడుతుంటాయి. అవి ఎక్కడ ఉంటాయో ఊహించడం కష్టం కాబట్టి ప్రదేశాలను ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. తాజాగా జోయీ జాసెల్సన్ అనే అమెరికన్‌ నేవీ ఆఫీసర్ తన బెడ్ రూమ్‌లో ఒక విషపూరితమైన పామును కనిపెట్టాడు అది చాలా పెద్దగా ఉండటంతో కంగుతున్నాడు. మూడు రోజులగానే అతను బెడ్ రూమ్ లో తిరుగుతుండగా అనుకోకుండా, మొదటగా తన పక్కన పాము కుబుసం కనిపించింది. దాంతో ఆయనకు ఒళ్ళు జలదరించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో జోయీ తన గది మూలలో పామును కనుగొన్న క్షణాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆ పాము కోసం వెతుకుతూ, ఒక క్యాబినెట్ వెనుక పెద్ద పామును చుట్టుకుని ఉన్నట్లు చూశాడు. ఆశ్చర్యకరంగా, జోయీ ఆ పామును ప్రశాంతంగా బయటకు తీసి, అద్దం ముందు తన చుట్టూ చుట్టుకున్నాడు. అతను ఇంత పెద్ద సాహసం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. జోయీ తన వీడియోలో, "ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది, కానీ నేను దీన్ని ఇంట్లో ఉంచకూడదని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను ఇది కాటేయలేదు " అని చెప్పాడు. వీడియో క్యాప్షన్‌లో, "నా బెడ్ రూమ్‌లో ఏముందో మీరు నమ్మరు" అని రాసి ఉంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ, కామెంట్లలో చాలా ఫన్నీ కామెంట్లు పెట్టారు. ఈ https://www.instagram.com/reel/C9vri2wsLcg/?utm_source=ig_web_copy_link లింక్ పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

ఒక వ్యక్తి, "ఈ పాము చాలా అందంగా ఉంది! ఇది విషం లేని కింగ్ స్నేక్. ఇది ఇతర విషపు పాములను చంపి తింటుంది" అని రాశాడు. మరొకరు, "అతను పాముతో 'రా! మనం మూడు నెలలు రూమ్‌మేట్స్‌గా ఉన్నాం! నువ్వు ఎక్కడికి వెళ్ళావు?' అని అడిగినట్లుగా అనిపిస్తోంది" అని జోక్ చేశాడు. మరికొందరు, "నాకొక డౌట్. నువ్వు దానికి అద్దె వసూలు చేస్తున్నావా?" అని అడిగారు. మరొకరు, "అతను చాలా సరదాగా పామును పట్టుకున్నాడు" అని రాశారు. మరొక వ్యక్తి ఆ పాము గురించి మరిన్ని వివరాలు చెప్తూ, "కింగ్ స్నేక్! ఇది చాలా అందమైన పాములలో ఒకటి! ఇది విషం లేనిది, ఇది ఇతర పాములను, ముఖ్యంగా విషపు పాములను తింటుంది" అని అన్నాడు.

జోయీ జాసెల్సన్ తనను తాను పాములను పెంచేవాడిగా చెప్పుకుంటాడు. అతను ఇలాంటి సంఘటనలకు అలవాటుపడిపోయాడు. అతని ఇన్‌స్టాగ్రామ్‌లో పాములు, ఇతర జీవులను కనుగొన్న వీడియోలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: