ఈ మధ్య కాలంలో ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఇదే భావన కలుగుతుంది. ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాళ్లలో ఉన్న మృగాలు బయటికి వచ్చి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూనే ఉన్నాయి. కొంతమంది అత్యాచారాలు చేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే.. ఇంకొంతమంది అత్యాచారాలతో ఆగకుండా దారుణంగా హత్యలు కూడా చేస్తూ ఉన్నారు.


 మరి ముఖ్యంగా కోల్కతాలో ట్రైని డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారం హత్య ఘటన గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో ఇలాంటి క్రూరమైన మనుషుల రూపంలో ఉన్న మృగాలు కూడా ఉన్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలిగింది. అయితే మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తూ ఉద్యోగాల్లో వ్యాపారాలు పురుషులకు పోటీ ఇచ్చేందుకు మహిళలు ముందడుగు వేస్తూ ఉంటే.. కామపు కోరలు మాత్రం ఆడపిల్లలను అడుగడుగున వెంటాడుతూనే ఉన్నాయి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇందుకు నిదర్శనంగా మారింది.


 ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి ఘటనలు జరిగితే ఇంకా ఆడపిల్లలు రోడ్లపైకి ఎలా వస్తారు అని ప్రతి ఒక్కరి మనసులో ఒక భావన కలుగుతుంది. అమ్మాయిలు రోడ్లపై కనిపిస్తే ఆకతాయిలు ఎంతలా చెలరేగిపోతున్నారు అన్నదానికి నిదర్శనంగా ఈ ఘటన నిలిచింది. ఆడవాళ్లు ఒంటరిగా కాదు కనీసం గుంపులుగా కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఉత్తరాఖండ్లో హల్ డ్వానిలో యువతీ తనను కొందరు యువకులు కారులో వెంబడిస్తూ వేధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో ఏకంగా యువకులు కారు విండో బయట నుంచి బయటకి వచ్చి కూర్చుని మరి ఇక నోటికొచ్చినట్లు వాగుతూ అమ్మాయిలను వేధిస్తూ ఉండడం కనిపిస్తుంది. అయితే ఇలా చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: