ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూమ్ లో కెమెరా ఉన్నట్లు కొంత మంది అమ్మాయిలు గుర్తించారు. వెంటనే వారు తమ తోటి విద్యార్థినులకు చెప్పారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఈ ఘటనపై అమ్మాయిలు కాలేజీలో పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో విద్యార్థినుల కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు నేతలు కాలేజీకీ చేరుకున్నారు. ఈ ఘటనపై నిన్నటి నుంచి కూడా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువకుడు విజయ్ ప్రమేయం ఉందని విషయం బైటపడింది.పోలీసులు రంగంలోకి దిగి.. విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విజయ్.. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోలు, ఫోటోలను తన ల్యాప్ టాప్ లలో డౌన్ లోడ్ చేసుకుని అమ్ముకుంటున్నట్లు కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. నిందితుడు విజయ్ కు మరో యువతి కూడా సహాయం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బైటడింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు దాదాపుగా.. 300 ఫోటోలు, వీడియోలు అతను విక్రయించినట్లు కూడా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కాలేజీలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కూడా విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సదరు విజయ్ అనే కుర్రాడికి అంతా కలిసి దేహశుద్ది కూడా చేశారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డుకుని విజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు అంతా పోరుబాట పట్టారు. తమకు న్యాయం జరిగే వరకు తాము వెనక్కు తగ్గమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు పోలీసులు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఇదంతా ఫేక్ అంటూ జరుగుతన్న ప్రచారంపై స్పందిస్తూ.. దర్యాప్తు చేయడానికి పోలీసులు నెల రోజుల సమయం కావాలని రాత్రి కోరారని, తెల్లారే సరికి ఇదంతా ఫేక్ అంటూ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. మహిళల భద్రత అంతే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: