సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి కొన్ని ఘటనలు గురించి తెలిసిన తర్వాత కొంతమంది ఆలోచించే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఏకంగా పిచ్చి పీక్స్ అనే పదానికి వారి ప్రవర్తన తీరు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. కొంతమంది తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్లు తమ వాహనం యొక్క నెంబర్ ప్లేట్ లలో ఉండాలని కోరుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే.


 ఇక దీనికోసం లక్షల రూపాయలు సైతం వెచ్చించడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే నెంబర్ ప్లేట్ కోసమే ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారు అంటే ఇక వారి దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే కారు ఉండే ఉంటుంది అని అందరి భావన. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కారు కొనుగోలు చేసిన ధర కంటే రెట్టింపు కాదు ఊహకు కూడా అందని విధంగా నెంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేశాడు. ఇక ఈ విషయం గురించి తెలిసి ఇంటర్నెట్ జనాలు మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు దొరుకుతున్న ఈవి వెహికల్స్ లో ఎంజీ కామెట్ ఈవి వెహికల్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ కారు ప్రారంభ ధర ఎక్కవ ఏడు లక్షలు మాత్రమే.



 ప్రస్తుతం డిజైన్ పరంగా అతి చిన్న హచ్ బ్యాక్ ఎలక్ట్రికల్ కారుగా ఇది ఉంది. కేవలం సిటీలలో తిరిగేందుకు అణువైన కారుగా మాత్రమే ఉంటుంది. అయితే ఈ కారు ఇక్కడ ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. సరే ఇలా కొనుగోలు చేయడంలో తప్పేమీ లేదు. అయితే ఈ కారు కోసం ఫాన్సీ నెంబర్ ప్లేట్ కావాలి అనుకున్నాడు. దీనికోసం 7 లక్షల కారుకి కోటి రూపాయలు పెట్టి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆటో జర్నల్ పేజీలో ఒక కోటి రూపాయల విలువైన ఫ్యాన్సీ నెంబర్తో ఎంజి కామెట్ ఇవి ఎలక్ట్రికల్ కారు వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది చూసి ఇంటర్నెట్ జనాలు ఆశ్చర్యలో మునిగిపోతున్నారు. పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: