దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని  తగ్గించడానికి  కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే పెట్రోల్ బంకులలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని వినియోగించాలి అంటూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది.అయితే ఇప్పటిదాకా అది పూర్తిగా అమలు కాలేదట.. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కూడా తెలియజేస్తూ వాటికి ఎక్కువ మక్కువ చూపింది.. కానీ పెట్రోల్లో కలపాలనుకునే ఇథనాల్ అనేది ఇథైల్ ఆల్కహాల్.. అయితే ఇది చక్కెరను పులియబెట్టడం వలన లభిస్తుందట.


ఇక మనకి త్వరలోనే ఇథనాల్ కలిపిన పెట్రోలు అందరికీ అందుబాటులోకి రాబోతోంది ఇది ప్రత్యేకంగా బైకుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారట. దీనివల్ల పెట్రోల్ కూడా చౌక ధరకే లభిస్తుందని సమాచారం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్లే చమురు కంపెనీ సంస్థలు కూడా..ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అమ్మేందుకే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం తీసుకొని ఇప్పటికీ ఎన్నో ఏళ్ల అయినా కార్యచరణ చేయలేదు.. ఎందుకంటే పెట్రోల్ ఇది సురక్షితమా కాదా వాహనాలను దెబ్బ తినేలా చేస్తాయ వంటి అంశాలను కూడా పలు రకాల కంపెనీలు పరిశీలిస్తున్నాయట.


పెట్రోల్ తోపాటుగా ఇథనాల్ లేకపోతే మిథనాల్ మిక్స్ చేసేలా చూస్తున్నారు. అయితే పెట్రోల్ అంతా ఎక్కువగా కలపరని లీటర్ పెట్రోల్ కేవలం 20% మాత్రమే ఇథనాల్ కలిపేలా చూస్తున్నారట పెట్రోల్ సంస్ధలు. 2025 సంవత్సరాని కల్లా ఇది 50% వరకు పూర్తి అవుతుందని సమాచారం.. ప్రస్తుతానికి 20 శాతం వరకు మాత్రమే ఇది కలిపాలా చేస్తున్నారు.. ఈ పెట్రోల్ జియో బీపీ పెట్రోల్ బంకులలో మాత్రమే లభిస్తుందట . ప్రభుత్వ పెట్రోల్ బంకులలో ఫ్లెక్స్ పెట్రోలు సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ .110 రూపాయలు ఉండగా..  ఇథనాల్ ధర రూ .55 రూపాయలు ఉండగా.. పెట్రోలు 20 శాతం ఇది కలిపితే సుమారుగా పెట్రోల్ ధర రూ .80 రూపాయలకు చేరుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: