ఇక ఒక్కసారి సింహానికి ఆకలి వేసిందా ఆ రోజు ఏదో జంతువుకు చివరి రోజు అవుతుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సింహం ఒక్కసారి పంజా విసిరింది అంటే ఏ జంతువు అయినా సరే తోక ముడవాల్సిందే. అలాంటి భారీ సింహం ఏకంగా మనిషి పై పంజా విసిరితే ఆ పంజా దెబ్బకి మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది అందుకే ఎక్కడికైనా జూకి వెళ్లినప్పుడు సింహంతో జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం సింహం బోనులోకి చేయి పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించాడు.
అది కూడా సింహం పక్కనే ఉన్న సమయంలో. తర్వాత ఏం జరుగుతుంది. ఇంకేముంది సింహం అతని చేతిని తినేసి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. వాస్తవానికి అలాగే జరగాలి. కానీ ఇక్కడ సింహం శ్రావణమాసం దీక్ష పూనిందో లేకపోతే దాడి చేయాలని మూడ్ లో లేదో తెలియదు. కానీ నా బోన్ లోంచి చెయ్యి బ్రో అంటూ అతని చేతిని బయటకి నెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సింహం ఎన్ క్లోజర్ లో సెల్ ఫోన్ పెట్టి ఇక సింహాన్ని ఎంత దగ్గరగా ఫోటో తీసేందుకు యువకుడు ప్రయత్నించాడు. నెమ్మదిగా అక్కడికి వచ్చిన సింహం రూల్స్ క్రాస్ చేయొద్దు. చెయ్ తీయ్ బ్రో అన్నట్లుగా అతని చేతులను బయటకు తోసేసింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా.. సింహం మంచి మూడ్ లో ఉంది. కాబట్టి అతను బ్రతికి పోయాడు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.