పెద్ద పెద్ద బిల్డింగులు సైతం ఇలా వరద ముంపుకు గురవుతున్నాయి అని చెప్పాలి. దీంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో గ్రామాల మధ్య రాకపోకల నిలిచిపోయాయి. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిబ్బందంలోకి వెళ్లిపోయాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు పోలీస్ సిబ్బంది ఇక కంటిమీద కునుకు లేకుండా సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. వరదల్లో చిక్కుకుంటున్న ప్రజల్ని రక్షిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఇక్కడ వరద నీటిలో చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇద్దరు పోలీసులు యువకుడు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాగు పొంగిపొర్లుతూ ఉండగా అటువైపుకు ఒక వ్యక్తి వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్ తకీయుద్దీన్, కానిస్టేబుల్ రాము నాగనూలు వాగు వద్ద 50 ఏళ్ల వ్యక్తిని బ్రిడ్జి దాటడానికి ప్రయత్నిస్తూ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా... ప్రాణాలను పణంగా పెట్టి కాపాడేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పోలీసులు కూడా బ్రిడ్జి మధ్యలోకి చేరుకోగా ఒక వ్యక్తి నీటి ప్రవాహాన్ని ఆపడానికి వారికి సమీపంలో కారును ఆపాడు. ఇక కార్ డోర్ను పట్టుకున్న యువకుడితో పాటు కానిస్టేబుల్ చైన్ పద్ధతిలో ఆ వ్యక్తిని నీటి ప్రవాహం నుంచి బయటకు లాగి చివరికి ప్రాణాలను కాపాడారు. ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పై అందరూ ప్రశంసల కురిపిస్తున్నారు.