ఈ క్రమంలోనే ఏకంగా మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే కుక్కల మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉన్న ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎంతో ప్రేమగా కుక్కను తెచ్చి పెంచుకున్నాడు. ఆ కుక్క అతను ఎలా చెప్తే అలా వింటుంది. కానీ ఆ కుక్క మొరగమని చెబితే యజమాని పైనే నిప్పుల వర్షం కురిపించింది కుక్క ఏంటి నిప్పులు కక్కడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఎక్కడో సింక్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు కదా. నిజమే ఇక్కడ కుక్క నిజంగానే నిప్పులు చెరిగింది. కానీ అది నిజమైన కుక్క కాదు రోబోట్ కుక్క.
ఒక అమెరికన్ యూట్యూబర్ ఏకంగా 84 లక్షల రూపాయలు ఖర్చు చేసి చైనా నుంచి అచ్చం కుక్కల పని చేసే ఒక రోబోట్ ని తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కుక్క చేసే పనులన్నీ కూడా ఈ రోబోట్ డాగ్ చేస్తుంది అంటూ సదరు వ్యక్తి ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనుకున్నాడు. ఇక స్విమ్మింగ్ పూల్ వద్దకు ఆ రోబోట్ ను తీసుకువచ్చి పరీక్షించాడు. ముందుగా ముందుగా అతను సూచనలు ఇచ్చిన విధంగానే ఆ రోబోట్ కుక్క చేసింది. లేవడం కూర్చోవడం.. షేక్ అండ్ ఇవ్వడం చెప్పినట్లుగానే చేసింది. ఇంతలో అతను కుక్కలాగా బౌ బౌ అని మోరుగమని సూచిస్తాడు. అయితే ఆ కుక్క మొరగకుండా అతనిపై నిప్పు రవ్వలను చిమ్ముతుంది. దీంతో అతను ఒక్కసారిగా షాకై వెంటనే స్విమ్మింగ్ పూల్ లో దూకి ప్రాణాలను కాపాడుకుంటాడు. దీంతో నిజమైన కుక్క యజమాని ప్రాణాలు కాపాడితే రోబో కుక్క ప్రాణాలు తీసేలాగే ఉంది అని ఎంతో మంది నేటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.