అయితే ఈ మధ్యకాలంలో ఎవరు ఎలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి ప్యాకేజీ ఎంత వస్తుంది అన్న విషయం గురించే అందరూ అడుగుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే వారికి మంచి ప్యాకేజీ వస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగం గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.ఇది నిజమా అబద్దమా అని చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణంగా సోడా షాపులో హెల్పర్ గా పనిచేసే వ్యక్తికి ఎంత జీతం ఇస్తారు. మహా అయితే నెలకు 8 నుంచి 10,000 వరకు జీతం ఇస్తారు.
ఎందుకంటే సోడా షాప్ లో వచ్చే ఇన్కమ్ తో పోల్చి చూస్తే ఇక యజమాని అతని కింద పని చేసే హెల్పర్ కి అంత మొత్తంలో మాత్రమే చెల్లించ గలడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన కింద అసిస్టెంట్గా చేరిన వ్యక్తికి సంవత్సరానికి ఆరు లక్షల జీతం ఇస్తాను అంటూ చెబుతున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. భోపాల్ లో నరేంద్ర రాజ్పుత్ అనే వ్యక్తి సోడా స్టాల్ నలుపుతున్నాడు. అయితే అక్కడికి వచ్చిన ఒక కుర్రాడు మీకు రోజు ఇన్కమ్ వస్తుంది అని అడుగుతే.. నా రోజు ఇన్కమ్ గురించి పక్కన పెట్టండి. కానీ నా దగ్గర ఒక కుర్రాడు ఉద్యోగం కోసం కావాలి. అతనికి సంవత్సరానికి ఆరు లక్షల చేతికి ఇస్తాను అంటూ నరేంద్ర రాజ్పుత్ చెప్పుకొచ్చాడు. సోడా షాప్ లో అసిస్టెంట్ కి ఆరు లక్షల జీతం ఇవ్వడమేంటి అని అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.