రోజురోజుకి కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి ప్రపంచమంతా భయభ్రాంతులకు గురయ్యాల చేస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రజలను అతలాకుతలం చేసింది ఆ తర్వాత  వైరస్ అంటే చాలు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు ఇప్పుడు తాజగా హైదరాబాదులో నోరా వైరస్ కేసులు పెరుగుతున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇది ప్రజలకు ఆందోళన గురి చేసేలా కనిపిస్తోంది. నోరా వైరస్ వింటర్ వానిటన్ బగ్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారట. ఇది ఎక్కువగా కలుషితమైన నీరు ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుందనీ అధికారులు తెలియజేస్తున్నారు.


నోరా వైరస్ ఇది ఒక రకమైన వైరస్ గా ఉండడమే కాకుండా గ్యాస్ట్రో ఎంటేరిటీస్ కు కారణమవుతుందట. ముఖ్యంగా ఇది శరీరంలో ఉండే కడుపు ప్రేగుల వాపుకు కారణమై తీవ్రమైన వాంతులు విరేచనాలు వచ్చేలా చేస్తుందట. నారా వైరస్ లక్షణాలు విషయానికి వస్తే..

విరేచనాలు అవ్వడం, కడుపునొప్పి వాంతులు రావడం, చలి జ్వరం నీరసం డిహైడ్రేషన్ గా మనిషి కనిపిస్తూ ఉంటారట.


ఇక నోరా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయానికి వస్తే కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని తిన్నవారికి ఈ వైరస్ సోకుతుందట. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తులతో చేతులు తాకడం, మాట్లాడుతున్నప్పుడు  తుంపర్లు పడడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందట. హైదరాబాదులో పాత బస్తీలో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు గుర్తించారు.

నోరా వైరస్ రాకుండా ఉండాలి అంటే తరచూ శుభ్రంగా స్నానం చేయడమే కాకుండా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సాధారణంగా ఈ వైరస్ రెండు మూడు రోజులలోనే తగ్గిపోతుంది. డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ద్రవపదార్థాలను తీసుకోవలసి ఉంటుంది.స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉండాలి గోరువెచ్చని తాగడం వల్ల మరింత మంచిది. అలాగే దుస్తులను కూడా ఎండకి ఆరవేసిన తర్వాత వేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: