వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. తూర్పు చైనాలోని హౌస్ లో జంతు ప్రదర్శనశాలకు ఒక చిన్నారి వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడ గ్లాస్ ఇంక్లూజర్ లో బంధించిన పులిని చూసి వెంటనే ఆ పిల్లవాడు ఆ పూరి దగ్గరికి జాలిగా నడుస్తూ వెళ్ళాడు. ఈ క్రమంలో ఆ పిల్లవాడు పులి ఉన్న పక్కకు కాస్త ఒరిగి నవ్వాడు. అలాగే సరదాగా నవ్వుతూ.. పులి వద్దకు రాగానే ఫోటోకు ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టేసాడు. అంతలోనే ఆ పులి బాలుడిని వాసన చూసి పట్టుకునేందుకు ప్రయత్నించగా గాజు గోడ అడ్డు ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే., ఈ క్రమంలో పులి తన ముఖం ఓ వైపుకు తిప్పుకోగానే ఆ పిల్లవాడికి కోపం వచ్చిందనుకుంటా.. వెంటనే తన రెండు చేతులతో ఆ గ్లాసును కొడుతూ ఉన్నాడు..
ఆ పిల్లవాడికి ఆ పులిని కొట్టాలని ఉందనుకుంటా రెండు చేతులతో గ్లాస్ పై పదే పదే కొడుతూ ఉండడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో పులి కూడా తన ముందు రెండు కాళ్లతో గ్లాసును కొట్టడం మొదలు పెట్టింది. అలాగే అచ్చం ఆ బాలుడు ఎలా చేస్తే అలానే ఆ పులి కూడా చేయడం మొదలు పెట్టేసింది. ఇక ఈ వీడియోను ఫైట్ ఆఫ్ హాండ్స్ అనే క్యాప్షన్ జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిల్లవాడు, పులి ఆట వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ ఆ పిల్లవాడితో పులి ఆటలాడుతోంది అంటూ కామెంట్ చేయగా.. మరికొందరు లవ్లీ ఆఫ్ హాండ్స్ అంటూ కామెంట్ చేశారు.