తాజాగా పుణెలోని హింగణగావ్‌లోని ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హోటల్ గోకుల్ సిబ్బందిని ఒక మందుబాబు ప్రాణ భయంతో వణికించాడు. పూటుగా మద్యం తాగి వచ్చిన ఈ వ్యక్తి, హోటల్ లో తనకు ఆహారం ఇవ్వాలని అడిగాడు. అయితే ఫుడ్ లేదని చెప్పడంతో అతడు కోపగించుకుని తన ట్రక్‌ను వేగంగా నడిపి హోటల్‌కు డ్యాష్ ఇచ్చాడు. ఈ విచిత్రమైన సంఘటన భారతదేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది, హోటల్ గోకుల్ వద్ద నిలబడి ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ డ్రైవర్ హోటల్ ని తన ట్రక్ తో గుద్దుతున్న దృశ్యాన్ని వీడియో తీశారు.

వీడియోలో ఆ వ్యక్తి తన ట్రక్‌తో హోటల్ భవనాన్ని ఎన్నిసార్లు ఢీకొట్టాడో చూడవచ్చు. అలాగే, హోటల్ ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు. శుక్రవారం రాత్రి, పుణె జిల్లాలోని ఇంద్రాపూర్‌లో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఈ ట్రక్కు డ్రైవర్, పుణె-సోలాపూర్ హైవే మీద ప్రయాణిస్తున్నాడు. ఆ హైవే పక్కనే ఉన్న ఒక హోటల్‌లో తనకు ఆహారం కావాలంటూ అడిగాడు. కానీ హోటల్ సిబ్బంది ఇవ్వలేదు. ఆ కోపంతో, ఆయన తన భారీ కంటైనర్ వాహనాన్ని హోటల్ బిల్డింగ్ కి గుద్దాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు, గాయాలు కూడా కావు. కానీ, హోటల్ భవనం చాలా దెబ్బతిన్నది.

ఇతనికి ఫుడ్ ఇవ్వడానికి హోటల్ ఓనర్ ఎందుకు తిరస్కరించాడు అంటే ఆ సమయంలో అతను బాగా తాగి ఉన్నాడు. ఫుడ్ పెట్టినా అతడు బిల్ పే చేస్తాడు అనే నమ్మకం ఓనర్ కి కలగలేదు. అందుకే భోజనం లేదు వెళ్ళు బాబు అనేసి సున్నితంగా అని చెప్పాడు. కానీ డ్రైవర్ తనకి ఒక్కరికే భోజనం లేదు అంటున్నాడని, అందరికీ భోజనం పెడుతున్నాడని కోపం తెచ్చుకున్నాడు. అంతే ఇంకేముంది తన ట్రక్ ను నేరుగా హోటల్ బిల్డింగ్ లోకి తోలడానికి ప్రయత్నించాడు. మళ్లీ వెనక్కి వచ్చే కార్లను, హోటల్ ముందు ఉన్న వాహనాలను తన కంటైనర్‌ ట్రక్కుతో గుద్దేస్తూ ధ్వంసం చేశాడు.

అయితే ఆ వాహనాల ఓనర్లు, స్థానికులు ఈ దృశ్యం చూసి షాక్ అయిపోయారు. సైకో లాగా బిహేవ్ చేస్తున్న ఇతడిని ఆపేందుకు రాళ్లు కూడా వేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అతడు చాలా వాహనాలను తన లారీ తో డామేజ్ చేశాడు. చివరికి వాహనాలు లారీ టైర్ కింద ఇరుక్కోవడం వల్ల అది ఆగిపోయింది. మరొకరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడే అతన్ని అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. అతడు చేసిన డ్యామేజీని ఎవరు భరిస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మందు బాబు ఇంత బీభత్సం సృష్టించడం చాలా ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తు పార్క్ చేసిన కార్లలో ఎవరూ లేరు లేకపోతే వారు చనిపోయి ఉండేవారు. https://x.com/pulse_pune/status/1832272688062087252?t=tWTmQVxpHaToPhlQHleaAQ&s=19 ఈ లింకు పైన క్లిక్ చేసి ఆ ట్రక్కు డ్రైవర్ వీడియో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: