ఈ మధ్యకాలంలో మనుషులు ఏకంగా ప్రకృతినే సవాల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా చెట్లను నరికి వేస్తూ భావనలను నిర్మించుకుంటున్నారు. అంతేకాదు పెద్ద పెద్ద నది ప్రవాహాలను ఆపేందుకు ఇలా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇలా ప్రకృతిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించి కొన్ని కొన్ని సార్లు తీవ్ర విపత్తులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.


 ప్రకృతి ప్రకోపానికి మనుషులందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనలకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయ్. ప్రకృతికి కోపం వస్తే ఇంతటి భయానకమైన పరిస్థితులు వస్తాయా అని అందరూ అనుకుంటున్నారు  అయితే మొన్నటి వరకు ఇండియాలో వరదలు ఎంతలా ముంచెత్తాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇండియా పొరుగు దేశమైన చైనాలో కూడా ఇలాంటి ఒక ప్రకృతి విపత్తు అందరిని భయపెడుతుంది.


 చైనాలోని హైసన్, డాంగ్ డాంగ్ నగరాలపై యాగి తుఫాను విరుచుకుపడుతుంది. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ఇక ఇంతటి వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో రోడ్లపై వెళ్తున్న మనుషులు కొట్టుకుపోతున్నారు. యాగి తుఫాన్ వల్ల 8 లక్షల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అందరూ అంధకారంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు విద్యాసంస్థలు మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. హాంగ్కాంగ్, పాక్ ఎక్స్చేంజి షట్ డౌన్ అయింది. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన రెండో తుఫానుగా యాగి తుఫాన్ ను పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఇలా గాలి ఎంత దారుణమైన వేగంతో వేస్తుంది అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి సోషల్ మీడియా జనాలు కూడా భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vir