- కట్లేరు వరద తో కృష్ణా ఉగ్రరూపం
- ( దక్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) .
అదేంటి టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నారా ? తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడుతుంది అంటే చాలు ... విజయవాడలో దడ మొదలవుతుంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో మున్నేరు వాగు వరద పోటెత్తుతుంది. అక్కడ వరద బుడమేరుకు చేరుకుంటుంది.. అటు కట్లేరు కూడా పొంగి పొర్లుతూ కృష్ణలో కలుస్తోంది. ఇక ఖమ్మం నుంచి వ చ్చే మున్నేరు బుడమేరు లో కలవడం ... బుడమేరు వరద సహజంగానే విజయవాడకు చేరుకుంటుంది. దీంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి అంటే చాలు విజయవాడలో వణుకు మొదలైపోతుందన్న చర్చ ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు ... రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తోంది.
శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ విజయవాడలో వాన మొదలైంది. ఒకవైపు ఎగువ ప్రాంతాలలో భారీ వర్షం పడుతుండటం మరవైపు ఖమ్మం జిల్లాలో పలు చోట కూడా అదే స్థాయిలో వాన కురుస్తుండటంతో విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషానికి ఏమవుతుందో అని ఒకటి టెన్షన్ పడుతున్నారు .. కాస్త వాన తగ్గింది వరద నుంచి ఇళ్లకు జనం చేరుకున్నారు .. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు .. అనే టైంలో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.
మరోవైపు రోజుకు వరద పెరుగుతూ ఉండడంతో ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ దుస్థితిలో తాము ఎక్కడికి వెళ్లారో ఏం చేయాలో ? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విపత్తులు తట్టుకోవటం సాధ్యమా ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే రితిలో వర్షాలు రెండు రోజులు కొనసాగితే మాత్రం భయానకంగా ఉంటుందని విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు.