వినాయకుడు అంటే ఏనుగు రూపంలో దర్శనమే గుర్తుకొస్తుంది. ఆయనకే మనం పూజలు నిర్వహిస్తుంటాం. మానవ రూపంలో దర్శనమిచ్చే వినాయకుడు గురించి చాలా మందికి తెలియదు. మానవ రూపంలో ఉన్న ఈ వినాయకుడికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాలయం అది. ఇక్కడ తప్ప మరెక్కడా నరుని రూపంలో ఉన్న వినాయకున్ని దర్శించుకోలేరు. చదవండి మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో.. ఆ గణేషుని వివరాల్లేంటో తెలుసుకునేందుకు. భారతదేశంలో తమిళనాడులో ఈ వినాయకుడి ఆలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో కుట్నూర్ నుండి 3 కి.మీ దూరంలో తిల్లతర్పన్ పురి అనే ప్రదేశంలో ఉంది. విమానం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సమీపాన తిరుచిరాపల్లి విమానాశ్రయం ఉంది. ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో స్వామివారిని ఆదివినాయకుడుగా పిలుస్తారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ గణేశుడు మానవ రూపంలో పూజించబడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయంలో గణపతి విగ్రహం శరీరం.. మానవ ముఖంతో ఉంటుంది. ఇలా ఎందకు ఉంటుందంటే.. పార్వతి దేవి కోసం ఇంట్లోకి వెళ్ళబోతున్న శివయ్యను గణేశుడు అడ్డుకున్నాడు. దీంతో శివుడి కోపం వచ్చి తన త్రిశూలంతో గణేశుడి తలను తన శరీరం నుండి వేరు చేసి ఆ తలను భస్మం చేసినట్లు పురాణాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్వతి దేవి కోరికపై గణేశుడిని బతికించడం కోసం గణేశుడి మొండెంపై ఏనుగు తలను ఉంచి జీవం పోశారు. అప్పటి నుంచి వినాయకుడిని గజానుడి రూపంలో పూజిస్తున్నారు. అయితే ఈ ఆలయంలో మాత్రం గణపతిని ఆది అంటే గణపతి మొదటి రూపాన్ని పూజిస్తారు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు.అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటుంది.ఇక్కడ పిండ ప్రధానం,పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: