రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేష్ ని నామస్మరణంతో మారుమోగుతుంది.నిన్న మొదటి రోజు బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మరోవైపు విద్యుత్ కాంతిలో వివిధ రూపాల సెట్టింగులతో గణేష్ మండపాలు కళకళలాడుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా కొలువుదీరిన మండపాల్లో వినాయకుడు ఘనంగా పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఆయన చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. గణపతితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డు కూడా నవరాత్రులు పూజలు అందుకుంటుంది. ఆ లడ్డునూ నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. ఈ లడ్డూను దక్కించుకున్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే, దొంగలు ఈ లడ్డూను కూడా వదిలిపెట్టడం లేదు.అయితే కొంతమంది మాత్రం ఈ లడ్డుని ఎవరూ లేని సమయంలో సైలెంట్ గా ఎత్తుకెళ్లి పోతుంటారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చుక్కల్లో కొడుతుంది.లడ్డూను దక్కించుకున్న కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసిస్తారు. ఈ నేపథ్యంలో బాచుపల్లి పరిధిలో వినాయకుడి లడ్డును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు మాస్క్ ధరించి ప్రగతి నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లోకి దూరాడు. ఎవరూ లేరని గమనించి గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరీ చేశాడు. లడ్డు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ దొంగలు వచ్చారు జాగ్రత్త అంటూ నెటిజన్లు మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చేస్తున్నారు. గణపతి చేతిలోని లడ్డును దొంగలించి తింటే మంచి జరుగుతుంది అని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతుంటారని ,నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గణపతి చేతిలో ఉన్న లడ్డూలు దొంగతనానికి గురవడం కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. "గణపతి పప్పా మోరియా తాజా లడ్డు చోరియ" అంటూ దొంగతనంపై వారి వారి భాషల్లో స్లోగన్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: