ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా రెండు రాష్ట్రాలలో కూడా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలలో వరదలు సునామి సృష్టిస్తూ ఉండడంతో ప్రజలకు సైతం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతూ ఉండారు.  విద్యార్థులకు , ప్రభుత్వ ఇతర కార్యలయాలకు సైతం ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అయితే సెప్టెంబర్ 9 కొన్ని జిల్లాలలో కూడా పాఠశాలకు ప్రభుత్వం హాలిడేను ప్రకటించినట్లుగా తెలుస్తోంది.వరద ప్రభావిత ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.


ముఖ్యంగా విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, మాన్యం, అనకాపల్లి ,పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గోదావరి ,ఎన్టీఆర్, బాపట్ల పలు రకాల ప్రాంతాలలో మండలాలలోని విద్యాసంస్థలు కూడా హాలిడే ఇచ్చినట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయని ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కొన్ని జిల్లాలలోని వారందరినీ కూడా ప్రభుత్వం హెచ్చరించింది.


కేవలం అవసరమైతే తప్ప ఎలాంటి విషయాలలో కూడా బయటికి రాకూడదని హెచ్చరిస్తోంది. పలు రకాల ప్రాజెక్టులలో కూడా నీరు పుష్కలంగా ఉన్నాయని వాగులు పొంగిపొర్లిపోతున్నాయని ఇలా ఎన్నో ప్రాంతాలలో రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉండడంతో ప్రభుత్వం వీరిని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని లంకవాసులకు సైతం హెచ్చరిస్తూ ఎవరు బయటికి రాకూడదని అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ప్రజలను కూడా హెచ్చరించేది సముద్రంలో 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నట్లుగా తెలిపారు. దీంతో ప్రజలు కూడా ఒక్కసారిగా ఎక్కడ వరదలు వస్తాయని భయపడుతూ ఉన్నారు. అలాగే కోనసీమ ప్రాంతంలో కూడా వరద తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ఎవరైనా సరే సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నెంబర్లను ఆయా ప్రాంతాలలో అందిస్తున్నారు ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: