గత నెల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్రమైన వాయుగుండాలు ఏర్పడడం వల్ల భారీగా వర్షాలు రావడంతో వరదలు ఎక్కువ అవ్వడంతో ప్రజలు కూడా అతలాకుతలం అవుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం తో పాటు ఉత్తరాంధ్రను సైతం వాయుగుండం హడలెత్తిస్తోంది. కేవలం ఒక్క రోజులోని 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా వానలు పడడంతో విశాఖతో పాటు చుట్టూ ఉండే ప్రాంతాలలో కూడా ఒకసారిగా వానలు కురుస్తున్నాయి. విశాఖలోని లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.


విశాఖలోని సింహాచలం కొండలను ఆనుకొని ఉన్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండ చర్యలు విరిగి పడతాయేమో అని భయంతో కూడా విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వానలతో కొండల మీద నుంచి కూడా జోరుగా వర్షం కిందికి రావడంతో కొన్నిచోట్ల బండరాళ్లు కూడా విరిగి పడ్డట్లుగా తెలుస్తోంది. అలా జనాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇలా కొండ చర్యలు విరిగిపడడం వల్ల కూడా కొన్నిచోట్ల రహదారుల రాకలతో సైతం ఇబ్బందులు ఏర్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రజలను సైతం అప్రమత్తం చేసేలా చేస్తున్నారట. వాయుగుండం కళింగపట్నానికి తూర్పు వైపుగా 240 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తోందంటూ తెలియజేస్తున్నారు. దీంతో విశాఖతో సహా ఉత్తరాంధ్రలోని భారీ వర్షాలతో ప్రజలు తడిసి ముద్దలతో ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీ ప్రభుత్వం కూడ అక్కడ ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కొండ కింద ఉండే జిల్లాలోని ప్రజలు కూడా ఎత్తైన ప్రాంతాలలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. కేవలం విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి రావాలి అంటూ సూచిస్తున్నారట. వరదలను చిక్కుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆహారం పదార్థాలు ,వాటర్ బాటిల్లు ,మెడిసిన్ కిట్లు అన్నీ కూడా అందిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. అవసరమైతే వరదలలో చిక్కుకున్న  వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సహాయ బృందం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: