గత కొంత కాలంగా హైదరాబాద్ లో కొంతమంది కబ్జాదారులు చెరువులన పూడ్చేసి, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ చేసి అమాకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది తెలియని అమాయకులు ఆ స్థలంలో నిర్మాణాలు చేపడ్డం.. హైడ్రా వాటికి నోటీసులు ఇవ్వడంతో లబోదిబో అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తుంది. జీహెచ్ఎంసీతో పాటు సిటీ లిమిట్స్ లోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో కూడా హైడ్రా పేరు చెబితే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లో ఇళ్లు నిర్మాణం చేసే వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.హైదరాబాద్ లో భవనాలు నిర్మించే వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై చెరువుల, నాలాలలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా నుంచి నిరభ్యంతర ధృవీకరణ యన్ఓసి ఉంటేనే నిర్మాణాలకు అనుమతి జారీ చేసే విధంగా నిబంధనలను సవరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది పలు బాడాబాబులు కట్టిన బిల్డింగులు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

సర్వే చేసిన ఆ నివేదికను హైడ్రా ప్రభుత్వానికి అందించనుంది. కాగా హైడ్రా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి.. కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వేను ఇంకో వార్మ్ రోజుల్లో హైడ్రా అధికారులు ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై ఇటీవల హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. కాగా హైటెక్ సిటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందు వస్తుందో వేచి చూడాలి.ఇటీవల హైడ్రా అధికారులు రాంనగర్ లో నాలాపైనిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను కూల్చివేశారు. కాగా, ఇప్పుడు హైటెక్ సిటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు ప్రధాన నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కాగా రాంనగర్, హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ మొత్తంలో నాలాలను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తారా? అనే చర్చ జోరందుకుంది.ఇదిలావుండగా హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: