ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయింది ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా ప్రతిరోజు ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తూ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి  వచ్చే కొన్ని ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. వామ్మో ఇలాంటి ఘటనలు సినిమాల్లో జరగడం చూశాం. కానీ రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయా అని ఇక ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ప్రస్తుతం చైనా, పిలిపిన్స్, వియత్నాం లాంటి దేశాల్లో యాగి తుఫాన్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 230 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అక్కడి జనాలు మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అర్థం కాక అల్లాడిపోతూ ఉన్నారు. ఏకంగా మనుషులు గాలి వేగానికి కొట్టుకుపోతూ ఉండడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భారీ వర్షాలు నేపథ్యంలో  ఎన్నో ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. 230 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో కనీసం సహాయక చర్యలు కూడా చేపట్టరాని పరిస్థితి నెలకొంది.



 అయితే చైనా, ఫిలిప్పీన్స్, వియత్నం దేశాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అన్నదానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ వీడియోనె ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఏకంగా ఈదురు గాలులు భారీ వరదల దాటికి ఉత్తర వియత్నాంలో బిజీగా ఉండే ఒక వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అనేక కార్లు ట్రక్కులు నీటిలో పడిపోయాయ్. రెప్పపాటు కాలంలో ఇలా బ్రిడ్జ్ కూలిపోవడం కి సంబంధించిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ ఘటనలో ఏకంగా 13 మంది గల్లంతు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: