ఈ దగ్గు మందు వాడడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ దగ్గు మందులు ఎక్కడ కనిపించినా కూడ వాడకూడదంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఇండియాలో తయారుచేసిన వాటి వల్ల 141 మంది ప్రాణాలు పోయాయని తెలియజేశారు.. గత కొన్నేళ్లుగా 100కు పైగా కేసులు చిన్నపిల్లలకు దగ్గు టానిక్కులు ఉపయోగించడం వల్లే ఇబ్బందులకు గురవుతున్నారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలియజేస్తున్నారు. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు సైతం దగ్గు మందు పేరుతో ఇలాంటి ఔషధాలు తయారు చేస్తున్నారట.
గాంబియా, ఉజ్బేకిస్తాన్ వడ్డీ దేశాలలో అయితే పదుల సంఖ్యలో పిల్లల మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయట. అందుకు కారణం ఈ దగ్గు మందులే అన్నట్లుగా WHO అధికారులు తెలియజేశారు. 2022లో ఈ విషయాన్ని తేల్చి చెప్పడం జరిగింది. అప్పటినుంచి ఇండియాలో దగ్గు మందులపైన కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ కూడా రోజురోజుకి కంపెనీలు సైతం పుట్టగొడుగుల పుట్టుకొస్తూ ఉన్నాయి. నిబంధనలను గాలికొదిలేసి మరి కొన్నిటిని తయారు చేస్తూ ఉన్నారు పలు రకాల కంపెనీ సంస్థలు దగ్గు మందు పేరుతో ప్రమాదకరమైన ఔషధాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇక మీదట మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు చూస్తున్నాయట.