ఈ నెలలో వరదల వల్ల ఇతరత్రా కారణాలవల్ల విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వీటితో పాటు ఉద్యోగస్తులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలు, కళాశాలలకు కూడ భారీగానే సెలవులు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ సెలవులు రాబోతున్నాయని తెలిసి విద్యార్థులైతే ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తూ ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో అయితే 5 రోజులపాటు సెలవులు ఇస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈనెల 14 ,15,16 తేదీలు వరుసగా మూడు రోజులు హాలిడే అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.


ముఖ్యంగా 14వ తేదీన రెండవ శనివారం.. 15వ తేదీన ఆదివారం అలా రెండు రోజులతో పాటు ఆ మరుసటి రోజున 16వ తేదీన మిలాద్ ఫెస్టివల్ కావడం చేత .. అలాగే కొన్ని ప్రాంతాలలో 17వ తేదీన వినాయక నిమర్జనం కారణం వల్ల ఆరోజు కూడా కొన్ని ప్రాంతాలలో సెలవు ఉన్నట్లుగా సమాచారం. దీంతో నాలుగు రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు కూడా భావించారు. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవుని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది..


14 ,15వ తేదీన సాధారణ సెలవులు అలాగే ఉండగా 16వ తేదీని మిలాద్ పండుగను నెలవంక దర్శనాన్ని బట్టి చేస్తూ ఉంటారు.. అందుకే 16 న  కనిపించకపోతే.. 17వ తేదీన జరుపుకునే అవకాశం ఉండడం చేత 16వ తేదీ సెలవుని రద్దుచేసి 17 ఇచ్చినట్లుగా సమాచారం. ఒకవేళ నెలవంక 16వ తేదీన కనిపిస్తే అదే రోజు హాలిడే ఉంటుందట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇందుకు సంబంధించి ఇంకా విషయమైతే ఏపీ ప్రభుత్వం తెలియజేయలేదు. ఏది ఏమైనా సెప్టెంబర్ నెలలో ఒకవైపు వరదలతో మరొకవైపు పండుగలతో ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఈ నెల అంతా ఎక్కువగా సెలవులు వచ్చేసాయి. ఇవే కాకుండా సెప్టెంబర్ నెలలో 22 ఆదివారం 28 నాలుగవ శనివారం 29 ఆదివారం సెలవులు కూడా వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: