నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తున్నారు. ఈక్రమంలోనే ఇంట్లో కూర్చున్న చోటు నుంచి ఇక స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్య గలుగుతూ ఉన్నాడు మనిషి. ప్రపంచ నలుమూలలో జరిగిన విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తు వైరల్ గా మారిపోతున్నాయి. కొన్ని వీడియోలు అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.


 మరి ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో ఎంత వైరల్ గా మారి పోతూ ఉంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. సాధారణం గా పాములు అంటే అందరికీ భయమే. అందుకే డైరెక్ట్ గా పాములను చూడడానికి తెగ భయపడి పోతూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాములకు సంబంధించిన వీడియోలు చూడడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాములు ఎలా దాడి చేస్తాయ్. కాటు వేసే ముందు ఎలా ప్రవర్తిస్తాయి అన్న విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఎన్నో ఘటనల్లో పాములు మనుషులను కాటు వేయడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 కానీ ఒక మనిషి పాములు కాటు వేయడం ఎప్పుడైనా చూసారా.. ఊరుకోండి బాసూ.. మనిషి ఏమైనా విష పూరితమైన జీవ కాటు వేయడానికి.. అలా కాటు వేస్తే పాము ఊరుకుంటుందా అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన జరిగింది. ఒక వ్యక్తి చేతిలో పాము పట్టుకోగా.. అది అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే ఆ యువకుడే పామును కాటు వేస్తాడు. దీంతో నొప్పితో ఆ పాము అల్లాడిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా.. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: