మహాభారతంలో పాత్రలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ద్రౌపతి పాండవులను 5 మందిని వివాహం చేసుకోవడం గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే.. మహాభారతంలో ఎవరిని అడిగినా కూడా పాండవుల భార్య ద్రౌపది వస్త్రాభరణం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే మహాభారత యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు.అయితే ద్రౌపది ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసింది.. ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి చూద్దాం.



ద్రౌపదిని స్వయంవరంలో అర్జునుడు గెలుస్తారు.దీంతో అర్జునుడు ఆమెను తీసుకొని కుంతి మాత దగ్గరికి వెళ్లినప్పుడు తాను గెలిచిన బహుమానాన్ని చూడమని అర్జునుడు కోరుతూ ఉండగా.. కుంతీమాత దేవుడు సన్నిధిలో ఉండడంతో తల తిప్పకుండా మీ ఐదుగురికి పంచుకోమని చెబుతోంది. ఈ విషయం విన్న పాండవులు కలత చెందిన తరువాత.. చివరికి  తల్లి మాట ప్రకారమే పాండవులు ఐదుగురు కూడా ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఈ విషయం అటు పాండవుల మీద మచ్చగా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా ద్రౌపది మాత్రం తన భర్తలతో చాలా ఆనందంగానే జీవించేదట .ముఖ్యంగా వీరిమధ్య ఎలాంటి ఇబ్బందులు గొడవలు రాకుండా ఉండేందుకే ఒక నియమం పెట్టిందట.


ద్రౌపది కొన్ని నెలలు ఒక్కో దగ్గర ఉండేదట. పాండవులలో ఒకరి దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఎవరు కూడా ఆమె ఉన్నచోటికి అసలు వెళ్ళకూడదు.. అలా వెళితే వారు అరణ్యవాసానికి వెళ్లాల్సి ఉంటుందని నియమాన్ని కూడ పెట్టిందట. ఇలా వీరి మధ్య గొడవలు రాకుండా చూసుకుంది ద్రౌపది.. ద్రౌపది గురించి మరొక విషయం ఏమిటంటే ఆమె యుక్త వయసులో ఉన్న స్త్రీగా అగ్ని నుంచి జన్మించింది.. అందుకే ఆమె ఒక భర్త నుంచి మరొక భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగానే వెళ్తూ ఉండేదట. అది ఎలా అంటే ఆమె ఒక భర్త నుంచి మరొక భర్తకు వెళ్లే సమయంలో అగ్నిలో నడిచిన తరువాత ఆమె తిరిగి కన్యక అయ్యాకే మరో భర్త వద్దకు వెళ్లేదట.


ద్రౌపది తన ఇంటికి ఎవరు భోజనానికి వచ్చినా కూడ వారికి లేదనకుండా పెట్టేది.. ద్రౌపది ఎక్కువగా శ్రీకృష్ణుడిని తన భర్తలనీ, తల్లిదండ్రులను,సోదరుడిని మాత్రమే ఎక్కువగా నమ్మేది. ద్రౌపదికి శ్రీకృష్ణుడు ప్రియమైన సోదరుడుగా మిగిలిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: