కండలు తిరిగిన మగాళ్ళను సైతం భయపెట్టే ఆడవాళ్లు చిన్న బొద్దింకను చూస్తే మాత్రం భయంతో ఎగిరి గంతేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటివి కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాదు.. రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది ఆడవాళ్లు పైకి ఎంతో  ధైర్యంగా కనిపించిన చిన్న బొద్దింకను చూస్తే చాలు తెగ భయపడిపోతూ ఉంటారు. ఎక్కడైనా గోడ మీద బల్లి ఉంది అంటే అటువైపు వెళ్ళడమే మానుకుంటూ ఉంటారో అన్న విషయం తెలిసిందే.


 కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అటు చిన్న పిల్లలు కూడా ఇలా బల్లులు బొద్దింకలు లాంటివి చూసినప్పుడు తెగ కంగారు పడిపోయి భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టడం చూస్తూ ఉంటాము.. కానీ ఇక్కడ ఒక బుడ్డోడికి భయం అంటే మీనింగ్ ఏంటో తెలియనట్టుంది. ఎందుకంటే అతను చేసిన పనికి చూసి ప్రస్తుతం ఇంటర్నెట్ జనాలు మొత్తం షాక్ అవుతున్నారు. నిజమైన బల్లిని ఒక ఆట బొమ్మను చేసి ఆడుకున్నాడు ఇక్కడ ఒక బుడ్డోడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది


 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోను చూసుకుంటే ఇది ఒక ఇంట్లో చిత్రీకరించింది అనేది తెలుస్తుంది. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఒక కుర్రాడు చేతిలో బల్లిని పట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. అయితే పిల్లవాడు ఇలా బల్లిని పట్టుకోవడంతో ముందుగా అది బొమ్మ పల్లి అనే అందరూ అనుకుంటారు. కానీ దానిని నేల మీద వదిలేయడంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. అయినప్పటికీ ఆ బుడ్డోడు మాత్రం వదలలేదు. దానిని ఛేజ్ చేసి మరి పట్టుకొని ముద్దు కూడా పెట్టాడు. పెంపుడు  జంతువులాగ ప్రేమగా చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు.. అందరూ బల్లిని చూస్తేనే భయపడి పోతే.. ఈ బుడ్డోడు మాత్రం ఆ బల్లిని పట్టుకుని ఉన్నతీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: