దీంతో ఆ కర్ర గణపతిని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరిచి.. మళ్లీ వినాయక చవితికి బయటకు తీసి పూజలు నిర్వహించారంట. అలా ఏడాదికి ఏడాది గణనాథుడి ఆశీర్వాదంతో గ్రామం అభివృద్ది వైపు పరుగులు తీయడం.. కుగ్రామం కాస్త పట్టణంగా మారడం.. కర్ర గణపయ్య కొలువుదీరిన కుటీరం కాస్త ఆలయంగా అభివృద్ది చెందడం జరిగింది. 75 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని పాలజ్ గ్రామస్తులు చెప్తున్నారు.ఇదిలావుండగా వినాయక నవరాత్రులు ఒక ఎత్తైతే.. శోభయాత్ర మరో ఎత్తు. దేశమంతటా.. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా డీజే మోతలతో డ్యాన్సులతో యువత హంగామా తారస్థాయిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడి కర్ర గణనాథుల నిమజ్జన్నం మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత పాలజ్, తానూర్ , చిక్లీ , బోని గ్రామాలలో కొలువుదీరిన కర్ర లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. ఈ మూడు గ్రామాల్లో కొలువు దీరిన కర్ర గణనాథులకు అన్ని గణనాథుల వలే నిమజ్జనం మాత్రం ఉండదు.. 11 వ రోజు కర్ర గణనాథుడిని రథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడం.. అనంతరం మహాదేవుని విగ్రహం పై నీళ్లు చల్లి భద్రపరచడం ఆనవాయితీ.ఈ శోభయాత్ర వేళ హరి కీర్తనలు , భజనలు తప్ప డీజే మోతలు అస్సలు కనిపించవు. సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలాగా ఇక్కడి నిమజ్జన ఊరేగింపు కనువిందు చేస్తుంటుంది. ప్రతి రోజూ బ్రహ్మ ముహుర్తాన స్వామి వారి కాకడ హారతి, మధ్యాహ్నం గీత ప్రవచనం, రాత్రి కీర్తనలు, జాగరణలు, భజనలతో కోలాహలంగా కనిపిస్తాయి కర్ర గణనాథుడి కొలువైన ఈ మూడు గ్రామాల మండపాలు. ఈఏడాది కూడా ముచ్చటగా కొలువుదీరి మూడు జగాలను ఆశీర్వదిస్తూ ముక్కోటి పూజలందుకుంటున్నాడు కర్ర గణనాథుడు.