ఇంకొంతమంది కదులుతున్న రైలులో ఎక్కేందుకు ప్రయత్నించి చివరికి పట్టాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. రైలు ప్రమాదం అంటే ఇలాంటి తరహా ఘటనలు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విచిత్రకరమైన ఘటన జరిగింది. ఏకంగా ఒక ఎమ్మెల్యే రైలుని జండా ఊపి ప్రారంభించారు. కానీ ఇక అదే రైలు కింద ఆమె పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.
సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చి కొత్త రైలు ప్రారంభించిన సమయంలో.. రైల్వేస్టేషన్లో ఎంతలా హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తోపుసలాట కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. కొత్త రైలును జండా ఊపి ప్రారంభిస్తున్న ఓ ఎమ్మెల్యేలు అదే రైలు ముందు పట్టాలపై పడిపోయింది. ఆగ్రా - బనారస్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఫ్లాట్ ఫామ్ పై తోపుసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఆ రైలు జండా ప్రారంభిస్తున్న యూపీలోని.. ఇటావా బీజేపీ ఎమ్మెల్యే సరిత బద్ధౌరియా పట్టాలపై పడిపోయారు. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను వెంటనే పైకి లేపడంతో రైలును తిరిగి ప్రారంభించారు.