నేటి రోజుల్లో ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియా చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ దానితో సరి పెట్టుకుంటుంటే కొంత మంది మాత్రం సోషల్ మీడియా లో ఫాలోయింగ్ సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే తమలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని తమ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఎలాంటి శిక్షణ లేకుండానే ఇలాంటి తరహా విన్యాసాలు చేయడానికి సిద్ధమై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి   ఇలాంటి తరహా వీడియోలో సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తున్న జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే జరిగింది  సోషల్ మీడియా జనాలను ఆకట్టుకోవడానికి ఒక వ్యక్తి చేసిన సాహసం చివరికి అతని జీవితాన్ని నాశనం చేసింది.


 ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక యువకుడు ట్రాక్టర్కు ఉండే భారీ చక్రాన్ని తన రెండు కాళ్లతో పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఇక అనుకున్నట్లుగానే కాళ్లను ట్రాక్టర్ చక్రం పై పెట్టి దానిని పైకి లేపాడు. అయితే అంత బరువును ఆ కాళ్లు మోయలేకపోయాయి. రెండు కాళ్లు కట్టెపుల్లల విరిగిపోయాయి. కళ్ళముందే అంత భారీ ప్రమాదం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు  అతనిని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: