విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోయి నటిస్తాడు. ఈ మధ్యకాలంలో కాస్తంత నెమ్మదించాడు. ప్రకాష్ రాజ్ లేకుండా భారీ ప్రాజెక్టుతో సినిమా రూపుదిద్దుకోదు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది.దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశాడు.ఇందులో భాగంగా..మా అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు విష్ణు మంచు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ..ప్రకాష్ రాజు గారు మీరు కాస్త తగ్గండి.. తిరుమల ప్రసాదం లడ్డు అంటే.. కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసమని., హిందువుల విశ్వాసానికి ప్రతికంటూ తెలుపుతూనే.. అందుకు సమగ్ర విచారణ చేయిస్తారని ధర్మరక్షణకు చర్యలు తీసుకుంటారని.. మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిది అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తూ.., మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ విషయం మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. మా అసోసియేషన్ ఎన్నికల నేపథంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఎన్నికల పోరు జరిగిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీంను విష్ణు ఓడించి మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు తనకిచ్చిన కౌంటర్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు. విష్ణు కన్నప్ప సినిమా టీజర్ లోని ఆఖరి డైలాగ్ ను హేళన చేస్తూ పోస్ట్ చేసారు. "ఒకే శివయ్య నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది నోటెడ్"అని పోస్ట్ చేసారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: