సముద్రం అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే సముద్రపు ఒడ్డున కూర్చొని చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. సముద్రపు అలలు అలా ముందుకు దూసుకొచ్చి కాళ్ళను తాకుతూ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటే.. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా కాస్త కాలు సమయం దొరికింది అంటే చాలు ఇలా బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటాం. సాధారణ పరిస్థితుల్లో సముద్రం ఇలా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ తుఫాను సమయాల్లో సముద్రం అలలు చూస్తేనే భయం కలుగుతూ ఉంటుంది. ఒడ్డుకు వెళ్లి నిలబడాలి అన్న వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.


 అయితే ఇలా తుఫాను సమయంలో సముద్రం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నదానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తేనే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే ఏకంగా నడి సముద్రంలో పరిస్థితి ఇంకా ఎంత వణుకు పుట్టే విధంగా ఉంటుంది అన్నది ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంటుంది. అయితే ఇలా తుఫాను సమయంలో సముద్రం మధ్యలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.


 సముద్ర ప్రళయం వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో అందరికి తెలుసు. సునామీలు భీకర తుఫాను సమయంలో భారీ నష్టం వాటిల్లుతు ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక ఓడ చిక్కుకుంటే ఇక వారికి అది ఒక చీకటి రోజుగా మారిపోతూ ఉంటుంది. రాకాసి అలల మధ్య ఏకంగా ఓడలు అంత ఎత్తున ఎగసి పడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇలాంటి రాకాసి అలలు మధ్య నీటిలో బోల్తాపడకుండా ఓడలు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఏకంగా ఉవ్వేత్తున ఎగసిపడుతున్న కెరటాలలోకి ఆ ఓడలు దూసుకుపోతున్నాయి. అయితే వీడియోలో మాత్రం ఇక ఆ ఓడలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: