ఎంటర్టైన్మెంట్ అంటే ఊరికే దొరుకుతుంది. కానీ అటు ఫాలోయింగ్ అంటే ఊరికే రాదు కదా. తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టాల్సిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా తమ పాపులారిటీ సంపాదించేందుకు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టే విన్యాసాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు నేటి రోజుల్లో కొంతమంది ఇంటర్నెట్ అనే మాయలో మునిగిపోయిన జనాలు. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.
ఇప్పుడు వరకు ఎంతో మంది సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం విభిన్నమైన రీతిలో బైక్ విన్యాసాలు చేయడం చూసాం. అయితే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో బైక్ స్టంట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఏకంగా అతను బైక్ నడపడం చూస్తేనే భయమేస్తుంది అంటే.. ఇక ఏదైనా ప్రమాదం జరిగితే బైక్ నడిపే వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి బైక్ స్టంట్ చేయడం అవసరమా ఇది చూసి ఎవరు ఇలాంటివి ట్రై చేయకండి అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.