చైనా దేశం నుంచి ఎన్నో రకాల వాటిని డూప్లికేట్ ని తయారు చేస్తూ మార్కెట్లోకి కొన్నిటిని విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే ఇండియాలో 2014లో కొన్నిటిని నిషేధించడం కూడా జరిగింది. ముఖ్యంగా చైనీస్ వెల్లుల్లిని కూడా బ్యాన్ చేశారు ఇండియన్స్.. ఇందులో హానికరమైన రసాయనాలను ఉపయోగించి వీటిని కృతిమంగానే తయారు చేస్తున్నారట.ఇవి ప్రజల ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు.. మరి సాధారణ వెల్లుల్లితో పోలిస్తే చైనా వెల్లుల్లి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చూద్దాం. వీటిని ఎలా గుర్తించాలో కూడా చూద్దాం.


సాధారణ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి చాలా పెద్దగా ఉంటాయి. మందంగా కూడా ఉంటాయి. సాధారణ వైతే చాలా సన్నగా ఉంటాయి.


సహజంగా వెల్లుల్లి వాసన ఎక్కువ ఘాటుగానే ఉంటుంది. కానీ చైనీస్ వెల్లుల్లిలో మాత్రం అసలు వాసన అనేవే ఉండవట. ఇవి తినడానికి రుచిగా కూడా అనిపించవు.


రసాయనాలతో తయారు చేసే ఈ వెల్లుల్లిలు తెల్లగా కనిపిస్తాయి. కానీ సహజంగా కనిపించే వెల్లుల్లిలో కాస్త పసుపు రంగు లేదా నీలి రంగు కలర్ లో కనిపిస్తూ ఉంటుంది.


వెల్లుల్లి తొక్క తీసేటప్పుడు చేతులకు ఈజీగా వచ్చింది అంటే అవి చైనీస్ వెల్లుల్లి అని ఖచ్చితంగా గుర్తించాలి.


అయితే చైనీస్ వెల్లుల్లిలో వారు తయారు చేయడానికి అందులో సింథటిక్ పదార్థాలను రసాయనాలను కూడా కలుపుతున్నారట.. వీటివల్ల ప్రజలకు అల్సర్ ,ఇన్ఫెక్షన్ కడుపుకు సంబంధించిన ఇబ్బందులతో పాటుగా మూత్రపిండ సమస్యలు ఏర్పడుతున్నాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ఇలాంటి వెల్లుల్లి ఇండియాలో సైతం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ చైనీస్ మాత్రం రోజుకు ఒక పదార్థాలను తయారుచేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకునేలా కనిపిస్తోంది. ఇవే కాకుండా చైనా వస్తువులను కూడా వాడకపోవడమే మంచిదంటూ చాలామంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. మార్కెట్లో కొనేటప్పుడు చూసి కొనడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: