ప్రస్తుతం ఉన్న కాలంలో పెళ్లి అనే భావన మారిపోతుంది.. ఒకప్పుడు పెళ్లి అంటే ఎంతో పవిత్రమైన బంధం. ఒక్కసారి పెళ్లి అయితే వారు చనిపోయే వరకు కలిసి ఉండాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో పెళ్లిళ్లతో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలతోనే భార్యాభర్తలు విడిపోతున్నారు అక్రమ సంబంధాలలో, సహజీవనాలు , భార్యల మార్పిడి ఇలాంటివి ఒకప్పుడు విదేశాలకే పరిమితమైతే ఇప్పుడు మనదేశంలో కూడా ఎంతో కామన్ గా మారిపోయాయి. దీని కారణంగా మహిళలు స్వాతంత్రంగా ఉండాట‌మే ఇష్టపడుతున్నారు.  పెళ్లి బంధంలో ఏర్కోవటం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు.

దీని కారణంగా వచ్చే 60- 70 ఏళ్లలో అంటే 2100 నోటికి పెళ్లి అనే వ్యవస్థ ఉండకపోవచ్చు అని నిపుణులు కూడా అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోరనే ఆందోళనకరమైన ఈ విషయాన్ని వారు వెల్లటిస్తున్నారు. ఈ మేర‌కు నిపుణులు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లి వంటి బంధాలు ఎలా మారుతున్నాయి, సామాజిక మార్పులు, పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ, మారుతున్న లింగ సమానత్వం వల్ల సంప్రదాయ పెళ్లిళ్లు ఎలా అంతరించిపోతున్నాయో ఈ వీడియోలో వివరించారు. ప్రస్తుత యువతరం కెరీర్, వ్యక్తిగత అభివృద్ధి, అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇతర సంబంధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పెళ్లి అవసరం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు.


పెళ్లి అంటే బంధనం, స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్తు ఉండదు, కెరీర్ ఉండదు అనే భావనతోనే చాలామంది వున్నారు... దీంతో వీరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదని, పెళ్లయినా పిల్లల్ని కనడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి పెళ్లి అనేది ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉండగా.. రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు భవిష్యత్తులో మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. 1950ల నుంచి అన్ని దేశాల్లోనూ జననాల రేటు తగ్గుముఖం పట్టింది. 1950లో జననాల రేటు 4.84 శాతంగా ఉండగా.. 2021 నాటికి అది 2.23 శాతానికి పడిపోయింది. 2100 నాటికి అది 1.59 శాతానికి పడిపోతుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: