ప్రతి సంవత్సరం ఆస్తయుజ మాసంలోనే శుక్లపక్షంలో దసరా పండుగని సైతం హిందువులందరూ కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం ఇదే రోజున శ్రీరాముడు లంకరాజు అయినటువంటి రావణాసురుడిని చంపేయడం వల్ల దుర్గాదేవి మహిషాసురుని సంహరిస్తుందని అందుకే ఈ రోజున విజయదశమి అనే పండుగను జరుపుకుంటారనే విధంగా తెలియజేస్తూ ఉంటాయి. అలాగే దుర్గాదేవి ప్రతిష్టించి నవరాత్రులను కూడా పూజిస్తారని తెలియజేస్తూ ఉంటాయి.


అలా నవరాత్రులు ముగిసిన తర్వాత పదవరోజునే దసరా పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆరోజున చాలా ప్రాంతాలలో రావణుడి దిష్టిబొమ్మను ఏర్పాటుచేసి ఆ బొమ్మ ను దహనం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది దసరా పండుగని ఎప్పుడు జరుపుకోవాలి అందుకు తగ్గట్టుగా శుభ సమయాలు ఎప్పుడు అనే విషయం గురించి వస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12వ తేదీన ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై అనంతరం ఆ మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 9:08 గంటలకు దశమి తిధి ముగుస్తుందట.


అయితే పంచాంగం ప్రకారం దసరా పండుగకు పూజ సమయం మధ్యాహ్నం 2:03 నిమిషాల నుంచి 2:45 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందట కేవలం 46 నిమిషాలలోనే పూజకు శుభసమయం అని తెలుపుతున్నారు. దసరా పూజను సైతం ఎప్పుడూ కూడా ఈశాన్యం మూలనే నిర్వహించాల్సి ఉంటుందట. తామర ఆకులతో పూజ చేయడం మరింత మంచిదట .అలాగే పూజ స్థలాన్ని కూడా పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. పూజ అయిపోయిన తర్వాత శ్రీరాముడు మరియు ఆంజనేయస్వామిని పూజించి అక్కడ నైవేద్యం సమర్పిస్తే మరింత మంచిదట. పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యాలను సమర్పిస్తే మంచి జరుగుతుందని మన హిందువులు నమ్ముతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: