ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ మనిషి జీవితంలో ఎన్ని మార్పులకు కారణం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలలో కూడా ఊహించని ఘటనలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఏకంగా మనుషులు చేయాల్సిన పనులన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోబోలు సహాయంతో పూర్తి చేయగలుగుతుంది. దీంతో ఇది రానున్న రోజుల్లో మానవాళి మనుగడకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని ఎంతో మంది నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.


 ఇప్పటికే మార్కెట్లో మనుషుల రూపంలో ఉండే రోబోలకు  విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనుషులు మాత్రమే కాదు ఏకంగా పెంపుడు జంతువులకు బదులుగా రోబోలు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. విశ్వాసానికి మారుపేరైన కుక్కలకి పోటీగా రోబోటిక్ శునకాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఏఐ టెక్నాలజీతో ఇవి పని చేస్తూ కుక్కల లాగానే ప్రవర్తిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే రోబోటిక్ డాగ్స్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోయాయి.


 ఇక ఇప్పుడు తెరమీదికి  వచ్చింది కూడా ఇలాంటి తరహా వీడియోనే. అయితే ఈసారి రోబోటిక్ డాగ్స్ మాత్రమే కాదు.. రియల్ డాగ్స్ కూడా ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయ్. రియల్ డాగ్స్ రోబోటిక్ డాగ్స్ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదానికి ఇక ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది అని చెప్పాలి. అయితే వీడియోలో ఉన్న ప్రకారం రోబో డాగ్ పార్కులో నడుచుకుంటూ వెళ్తుంది. ఇక నిజమైన కుక్కల గుంపు కూడా అక్కడ ఉంది. అయితే ఈ రోబో డాగ్ ను చూసి అవి ఆశ్చర్యపోయాయ్. ఈ రోబో కుక్క దగ్గరికి వెళ్లేందుకు తెగ భయపడిపోయాయి. నిజమైన కుక్కలతో స్నేహం చేసేందుకు రోబో డాగ్ ప్రయత్నిస్తుంటే ఒక వింత జంతువును చూసినట్లు కుక్కలు మాత్రం అక్కడి నుంచి పారిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: