నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనంగా మారింది.. అదేమిటంటే సముద్రం మధ్యలో ఒక పడవ మునిగిపోతున్నట్లు అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఈ వీడియో కాంగోలో ఒక ఘోరమైన పడవ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.. దక్షిణ కివు ట్రావెల్స్ లో మినోవా పట్టణం నుంచి గోమా ప్రయాణిస్తున్నటువంటి ఒక పడవ అందులో 278 మంది ప్రయాణికులతో  వెళుతూ ఉండగా.. ఈ పడవ ఓవర్ లోడ్ వల్ల గొమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఈ పడవ బోల్తా పడినట్లుగా తెలుస్తోంది.


ఈ పడవ కీపు సరస్సులో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఇందులో 78 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారట.మిగిలిన రెండు వందల మంది రెస్క్యూ బృందాలు కాపాడినట్లు తెలుస్తోంది. పడవ మునిగిపోయిన వెంటనే కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకి రాక మరి కొంతమందిని రక్షణ దళాలు కూడా కాపాడాయని తెలుస్తోంది. ఇంకా మరణాలకు సంబంధించి ఖచ్చితమైన సంఖ్య తెలియలేదని మరో రెండు మూడు రోజులలో సంఖ్య ఎంత అనే విషయాన్ని చెప్పగలమని కీవు ప్రావిన్స్ గవర్నర్ వెల్లడించారు.


ప్రస్తుతం రెస్క్యూటివ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఇందులో 78 మంది మృతి దేహాలు లభ్యం కాలేదని వెల్లడించారు.. కాంగో ప్రభుత్వ బలగాలకు..M23 మధ్య తిరుగుబాటు జరుగుతూ ఉండడంతో మూడేళ్లుగా ఈ యుద్ధం జరుగుతోందట. అందుకే రోడ్డు మార్గాలను మూసివేయడంతో గోమాకు చేరడానికి ఎక్కువ మంది పడవలనే ఆశ్రయిస్తున్నారట. దీంతో పడవలు రాకపోకలతో జనం కొనసాగుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఆ యుద్ధమే అంటూ పలువురు నేతలతో పాటు నేటిజన్స్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. సముద్రం మధ్యలో ఈ మృత్యు ఘోష చాలామంది కుటుంబాలను  అనాధలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: