నక్కలాగా వెన్నుపోటు పొడవడం కాదు.. ఏకంగా ఎదురెళ్లి మరి వేటాడుతుంది సింహం. ఇక ముందు ఉన్నది ఎంత భారీ జంతమైన సరే తన బలంతో ఒక్క పంజా విసిరి ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు సింహాలు కూడా మనుషుల్లాగా అప్డేట్ అయ్యాయి అని తెలుస్తుంది. ఓల్డ్ టైప్ వేటాడే విధానాలు వర్కౌట్ కావు అని తెలుసుకున్నాయో ఏమో.. ఏకంగా సినిమాల్లో చూపించినట్లుగానే మనుషుల్లాగా సరికొత్త స్కెచ్ వేసి మరి ఇక్కడ సింహాలు వేయటం కొనసాగించాయి. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వైరల్ గా మారిపోయిన వీడియో దక్షిణాఫ్రికాలో జరిగింది అన్నది తెలుస్తుంది. క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లోని పిండా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని సింహాలు కలిసి వేట కోసం వెతుకుతున్నాయ్. ఈ క్రమంలోనే వాటికి దూరంగా కొన్ని వైల్డ్ బీస్ట్ లు నడుస్తూ రావడం కనిపించింది దీంతో ఎలాగైనా వైల్డ్ బీస్ట్ లను ఒకదాన్ని ఆహారంగా మార్చుకోవాలని సింహాల గుంపు ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే వెంటనే ఒక పెద్ద స్కెచ్ వేస్తాయి. రొటీన్ కు భిన్నంగా మాస్టర్ ప్లాన్ వేసి ముందుకు సాగుతాయి. కొన్ని సింహాలు రోడ్డుపై వాటికి ఎదురుగా పడుకుని నక్కినక్కి చూస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే వాటిలో ఒక సింహం రోడ్డు పక్కగా వెళ్లి పొదల్లో దాక్కొని ఉంటుంది. అయితే రోడ్డు మీద ఉన్న సింహాలను దూరం నుంచి వైల్డ్ బీస్ట్ లు గమనిస్తూ ఉండగా.. పొదల్లో నుంచి ఒక సింహం దూసుకు వచ్చి ఒక్కసారిగా పంజా విసురుతుంది. ఇంతలో రోడ్డు మీద ఉన్న సింహాలు కూడా అక్కడికి పరిగెత్తుకు వెళ్లి.. ఆ వైల్డ్ బీస్ట్ ను వేటాడుతాయి ఇక ఏది చూసి అందరి ఆశ్చర్యపోతారు. సింహాలు కూడా అప్డేట్ అయ్యాయి అంటూ ఈ వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.