ఎక్కడైనా సరే మాయలు, మంత్రాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో సందర్భాలలో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నచిన్న ట్రిక్కులతో మ్యాజిక్ చేసి సామాన్యులను కూడా అబ్బురపరిచేలా చాలామంది మెజీషియన్స్ చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియా మాధ్యమికాలలో వైరల్ గా మారుతున్న ప్రకారం..ఈ వీడియోలో ఒక వ్యక్తి హోటల్లో అందరి ముందే తన టాలెంట్ ని సైతం ప్రదర్శిస్తూ అందరిని అబ్బురపరిచారు. ముఖ్యంగా తన జేబులో నుంచి రుమాలుతో ఏకంగా ఒక పామును సృష్టించి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశారు.



కానీ ఈ విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలు చూసి నమ్మలేకపోయారు. అయితే ఈ కనికట్టును అక్కడున్న వారు డైరెక్ట్ గా చూసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. వైరల్ గా మారుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన జేబులో నుంచి ఒక కర్చీఫ్ ని సైతం బయటికి తీసి.. దానిని అందరి ముందు విప్పి చూపిస్తూ టేబుల్ పైన రుమాళ్లను పరచడం జరిగింది. అయితే టేబుల్ పై ఉంచీ.. ఆ కర్చీఫ్ మీద కాస్త ఉప్పుని చల్లాడు. అలా చెల్లిని వెంటనే ఆ రుమాలు నుంచి పాము రావడం మొదలవుతుంది.


చివరికి ఆ కర్చీఫ్ మొత్తము కూడా ఒక పాము లాగా మారిపోతుంది.. దీనిని ఒక అమ్మాయికి చూపించగా అమ్మాయి భయంతో కేకలు పెట్టి పారిపోతుంది. అయితే అక్కడ ఉన్న వారందరూ ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. ఆ రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మెజీషియన్ వైపు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మెజీషియన్ ఎలాంటి మాయలు మంత్రాలు లేకుండా అందరూ ముందే చేశారు. కానీ ఆ పాము  ఎలా వచ్చింది అనేది ఈ వీడియో చూసిన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోని సుమారుగా 3 లక్షలకు మందికిపైగా వీక్షించినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: